Telugu News » Photo gallery » Here is the list of rare diamonds in the world, prices are top most
Viral: అత్యంత అరుదైన వజ్రాలు.. కోహినూర్ మాత్రమే కాదు.. ఇంకెన్నో.. ధర తెలిస్తే షాకే!
Ravi Kiran |
Updated on: Sep 12, 2022 | 8:17 PM
సహజసిద్దమైన వజ్రాలు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. ఆ మెరుపే వాటి విలువను చెబుతుంది. పురావస్తు తవ్వకాలు జరుపుతున్నప్పుడు..
Sep 12, 2022 | 8:17 PM
Diamond
1 / 7
కోహినూర్ డైమండ్: ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్-2 మరణం తర్వాత.. ఆమె కోడలు కెమిల్లా.. కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని ధరించనున్న సంగతి తెలిసిందే. 109 క్యారెట్ల కోహినూర్ డైమండ్ 21.6 గ్రాములు ఉంటుంది. ఈ వజ్రం ఖరీదు గురించి చెప్పాలంటే.. ప్రపంచం మొత్తానికి రెండు రోజులు ఫుడ్ పెట్టొచ్చు.
2 / 7
సాన్సీ డైమండ్: పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ఉన్న ఈ సాన్సీ డైమండ్ ప్రస్తుతం 55.23 క్యారెట్లతో 11.046 గ్రాములు ఉంది. కోహినూర్ తర్వాత ఇదే అత్యంత ఖరీదైన వజ్రం.
3 / 7
కల్లినన్ డైమండ్:
ప్రపంచంలోనే అత్యంత అరుదైన వజ్రాల్లో మూడోది ఇది. 3,106.75 క్యారెట్ల ఈ కల్లినన్ డైమండ్ ఖరీదు.. 400 మిలియన్ డాలర్లు.
4 / 7
హాప్ డైమండ్:
45.52 క్యారెట్ల ఈ హాప్ డైమండ్ 9.104 గ్రాముల బరువు ఉంటుంది. దీని ఖరీదు 350 మిలియన్ డాలర్లు.
5 / 7
డి బిర్స్ సెంటేనరీ డైమండ్:
273.85 క్యారెట్ల ఈ వజ్రం విలువ 100 మిలియన్ డాలర్లు. అలాగే ఈ డైమండ్ హార్ట్ షేప్‌లో ఉంటుంది.
6 / 7
స్టెయిన్మెట్జ్ పింక్ డైమండ్:
59.60 క్యారెట్ల ఈ వజ్రం..1999 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలోని వజ్రపు గనులలో దొరికింది. దీనిని పింక్ స్టార్ అని కూడా పిలుస్తారు. దీని విలువ సుమారు 71.2 మిలియన్ డాలర్లు ఉంటుంది.