- Telugu News Photo Gallery Child care tips taking not care of hygiene can make your child underweight in telugu
Child Health Care: మీ బిడ్డ బరువు పెరగడం లేదా? అయితే, ఇదే కారణం కావొచ్చు..
Child Health Care: సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ పల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి సమయానికి ఆహారం ఇవ్వడం, స్నానం చేయించడం, తదితర అన్ని విషయాలను తూచా తప్పకుండా పాటిస్తారు.
Updated on: Sep 13, 2022 | 6:33 AM

Child Health Care: సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ పల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి సమయానికి ఆహారం ఇవ్వడం, స్నానం చేయించడం, తదితర అన్ని విషయాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఆరోగ్యకరమైన, పోషకాలు ఉన్న పోషకాహారం ఇస్తుంటారు. ఇంత చేస్తున్నప్పటికీ.. కొందరు పిల్లలు బరువు చాలా తక్కువగా ఉంటారు. ఇదే వారిలో మరింత ఆందోళన రెకెత్తిస్తుంటుంది. అయితే, దీని వెనుకనున్న ముఖ్య కారణం ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

తల్లితండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందజేసినప్పటినీ.. వారు బరువు పెరగకపోవడం ఆందోళన కలిగించే అంశం. పిల్లలు బరువు తక్కువగా ఉండటం తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుంది. అయితే, దీని వెనుక ఒక ముఖ్యమైన తప్పు ఉందని నిపుణులు చెపుతున్నారు. ఈ తప్పును చేయకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

పరిశుభ్రత ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు. వాస్తవానికి, భారతదేశంలోని చాలా మంది తల్లిదండ్రులు చేతులు కడుక్కోకుండా పిల్లలకు ఆహారం తినిపిస్తారు. లేదంటే పిల్లలు ఎక్కడైనా చేయి వేసి చేతులు కడుక్కోకుండానే తల్లిదండ్రులు వారికి ఆహార పదార్థాలను అందజేస్తారు. ఇలా చేయడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

పరిశుభ్రత లేకపోవడం వల్ల పిల్లలు తక్కువ బరువు ఉంటారు. అలాగే, పిల్లలు అనేక రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతారు. జలుబు, ఫ్లూ తో పాటు.. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి.

పిల్లలు చిన్నవారైతే.. వారి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు ఆహారం పెట్టే ముందు ప్లేట్స్, మీ హ్యాండ్స్ కడుక్కోవాలి. ఒకవేళ మీ పిల్లలు స్వతహాగా తినేవారైతే.. తరచుగా చేతులు కడుక్కోవాలని, పరిశుభ్రతను పాటించాలని వారికి చెప్పాలి.

తల్లిదండ్రుల మరొక అజాగ్రత్త పరిశుభ్రత లోపానికి కారణమవుతుంది. తమ పనిలో తాము బిజీగా ఉండి.. పిల్లి కింద పడిన వాటిని తింటున్నా పట్టించుకోరు. కింద పడిన వాటిని తినడం వల్ల పిల్లలకు ఫుడ్ పాయిజన్ కూడా అవ్వొచ్చు.




