- Telugu News Photo Gallery Spiritual photos chanakya niti according to acharya chanakya teach a lesson to a person who is humiliating like this
Chanakya Niti: మిమ్మల్ని అవమానపరిచే వ్యక్తికి ఇలా గుణపాఠం చెప్పమంటున్న చాణక్య
ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, ఆర్థికవేత్త, దౌత్యవేత్త. అంతేకాదు మంచి ఉపాధ్యాయుడు కూడా. ఆయన విధానాలు నేటికీ అనుసరించగినవి. విజయవంతమైన జీవితం కోసం మీరు ఈ విధానాలను అనుసరించవచ్చు
Updated on: Sep 12, 2022 | 6:39 PM

సమయం సందర్భం లేకుండా.. మెలికలు తిరుగుతూ మాట్లాడేవాళ్ళను మనం చూస్తూనే ఉంటాం.. మన చుట్టు పక్కల ఇలా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారి మనసులో ఒకటి అనుకుంటారు.. బయటకు ఒకటి వ్యక్తం చేస్తారు. అలాంటి వారిని నమ్మడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి అలాంటి వారికి వీలైనంత దూరం పాటించండి

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవ జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలను గురించి చెప్పాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. మానవ జీవితాన్ని నరకంగా మార్చే చాణక్య నీతిలో ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఆ సంఘటనలు ఏంటో తెలుసుకుందాం.

ఎవరైనా మీ లోపాలను పదే పదే బయటపెట్టి మిమ్మల్ని తగ్గించాలనుకుని కోరుకుంటే, అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తిని ఉన్నతంగా చూపించండి. దీనితో మీరు అతన్ని ఎక్కువగా చేసి చూపిస్తూ.. అతడిని తక్కువ చేసి చూపించవచ్చు. దీని వల్ల ఎదుటి వ్యక్తి మీలో తప్పులు కనిపెట్టాలని చాలాసార్లు ఆలోచిస్తారు.

స్త్రీలు, పురుషులు తమ భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారనేది నిజం. అయితే చాలా మంది మహిళలు పురుషుల వ్యక్తిత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే.. అతని గొప్ప గుణమని నిరూపించవచ్చు. స్త్రీలు అత్యాశ లేదా అహంకార ధోరణులను కలిగి ఉన్న పురుషుల నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. మహిళలు నిజాయితీగా, విధేయతతో ఉన్నవారిని ఇష్టపడతారు. అటువంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు.

చెడు చేసే వారు - ఆచార్య చాణక్యుడు ప్రకారం మీ వెనుక చెడు చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇతరులకు మీ ముందు చెడు చేసే వ్యక్తి .. రేపు మీకు ఖచ్చితంగా చెడు చేస్తాడు.




