Ganpati Utsav 2022: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకి 27 ఏళ్ల చరిత్ర.. వేలంపాటలో వచ్చిన డబ్బును ఏంచేస్తారో తెలుసా..?

లడ్డూ వేలం పాటలో మొన్నటివరకూ బాలాపూర్‌ గణేష్‌ లడ్డూదే గరిష్ఠ ధర. ఐతే తాజాగా గండిపేట మండలం బండ్లగూడజాగీర్‌ గణనాధుని లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ రికార్డు బ్రేక్‌ చేస్తూ..

Ganpati Utsav 2022: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకి 27 ఏళ్ల చరిత్ర.. వేలంపాటలో వచ్చిన డబ్బును ఏంచేస్తారో తెలుసా..?
Balapur Ganesh Laddu
Follow us

|

Updated on: Sep 12, 2022 | 6:58 PM

Balapur Ganesh Laddu Auction price: ఇటీవల ముగిసిన గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్‌లో రంగరంగ వైభవంగా జరిగాయి. ఇక గణేష్‌ లడ్డూల వేలంపాటలు సరికొత్త రికార్డు సృష్టించాయి. లడ్డూ వేలం పాటలో మొన్నటివరకూ బాలాపూర్‌ గణేష్‌ లడ్డూదే గరిష్ఠ ధర. ఐతే తాజాగా గండిపేట మండలం బండ్లగూడజాగీర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని.. సన్‌సిటీ కీర్తి రిచ్‌మండ్‌ గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాస్‌లో ఏర్పటు చేసిన గణేష్‌ మండపంలోని.. గణనాధుని లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ రికార్డు బ్రేక్‌ చేస్తూ, సన్‌సిటీ లడ్డూ రూ. 60 లక్షల 83 వేలు పలికింది. అదే ప్రాంతానికి చెందిన ఆర్వీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వేలం పాటలో ఈ లడ్డూను దక్కించుకుంది. రెండో రికార్డు.. ఆల్వాల్‌ పరిధి కానాజిగూడలోని మరకత లక్ష్మీగణపతి ఆలయం లడ్డూ వేలంలో 45.99 లక్షలకు హిమాయత్‌నగర్‌కు చెందిన డాక్టర్‌ వెంకట్రావు దక్కించుకున్నారు.

వేలంలో లడ్డూకి వచ్చిన డబ్బును ఏంచేస్తారు…?

సాధారణంగా లడ్డూ వేలంపాటను నిర్వహించి వచ్చిన డబ్బును స్థానిక గణేష్‌ కమిటీ నిర్వహణలో..మంచి కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొంత మొత్తంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. లడ్డూ వేలానికి ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్‌ లడ్డూ వేలం సొమ్ముతో.. ఇప్పటివరకూ గ్రామంలో పాఠశాలలు, రోడ్లు, దేవాలయాలు నిర్మించారు. స్థానికులే కాదు స్థానికేతరులు ఈ లడ్డూ వేలం పాటలో పాల్గొనడం ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు రావడం ద్వారా గ్రామానికి లేదా ఆ ప్రాంత అభివృద్దికి మరింత ఖర్చు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ విశేషాలు…

2022 సెప్టెంబర్9న వేలంలో రూ. 24.60 లక్షలు ధర పలికిన లడ్డూను బాలాపూర్‌ ఉత్సవ సమితి సభ్యులు పొంగులేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. 2021లో బాలాపూర్‌ లడ్డూ రూ. 18.90 లక్షలు పలుకగా.. గతేడాది కంటే ఈ ఏడాది ధర 5.70 లక్షలు అధికంగా పలికింది.

బాలాపూర్ లడ్డూకు 27 యేళ్ల చరిత్ర….

బాలాపూర్ లడ్డూ వేలం పాటపై తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టి నిలిపారనడంలో సందేహం లేదు. ప్రారంభంలో ఇక్కడి లడ్డూల ధర రూ. 450 నుంచి మొదలై రూ. 24 లక్షల వరకు చేరుకుంది.1994లో రూ. 450లతో మొదలైన వేలం పాట కరోనా టైంలో తప్ప 27 ఏళ్లుగా లడ్డూ వేలం పాటలో ఈ ఏడాది సెప్టెంబర్9న నిర్వహించిన లడ్డూ వేలంపాటలో ఏకంగా 24 లక్షల 60 వేలు ధర పలికింది. ఎక్కడా లేని విధంగా వందలు, వేలు, లక్షల్లోకి చేరిపోయింది. రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలుకుతూ… కొన్న వారి కొంగు బంగారంగా నిలుస్తోంది. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలం పాట నువ్వానేనా అన్నట్లుగా జరుగుతుంటుంది.

  • 2000లో లక్షా 5 వేల రూపాయలకు బాలాపూర్ లడ్డూ వేలం
  • 1994 నుంచి 2001 వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది
  • 2002లో కందాడ మాధవ రెడ్డి పోటీపడి మరీ లక్షా 5 వేల రూపాయలకు లడ్డూ సొంతం చేసుకున్నారు
  • 2003లో లక్షన్నరకు పైన పలికిల ధర ఆ తర్వాత సంవత్సరం నుంచి ధర పెరుగుతూ వస్తోంది
  • 2007లో స్థానికుడు రఘునందనచారి 4 లక్షల 15 వేలకు పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు (అప్పటి వరకు
  • ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చిన లడ్డూ ధర ఏకంగా 2 లక్షలు పెరిగింది)
  • 2015లో బాలాపూర్ లడ్డూ 10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది (కళ్లెం మదన్ మోహన్ రెడ్డి 10 లక్షల 32 వేలకు లడ్డు దక్కించుకున్నారు)
  • 2016లో 14 లక్షల 65 వేల రూపాయలకు పెరిగిన ధర
  • 2016లో నాలుగు లక్షలు పెరిగింది (మేడ్చల్ కు చెందిన స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు)
  • 2017లో నాగం తిరుపతి రెడ్డి 15 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకున్నారు
  • 2018లోనూ స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు (మూడేళ్లు స్థానికేతరులకే బాలాపూర్ గణేష్ లడ్డూ దక్కింది)
  • 2019లో జరిగిన వేలంపాటలో అవకాశం స్థానికులకు దక్కింది (కోలను రాంరెడ్డి 17 లక్షల 60 వేల పాడి బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు)
  • 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి. ఆ లడ్డూను సీఎంకు అందజేశారు.
  • 2021లో అట్టహాసంగా జరిగిన వేలంపాటలో ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నాదర్గుల్‌కు చెందిన మర్రి శశాంక్ రెడ్డితో కలిసి 18 లక్షల 90 వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు.

ఇప్పటి వరకు కోటి 44 లక్షల 77 వేల రూపాయలు..

ఈ వేలంపాటను మొదట్లో గ్రామాభివృద్ధి కోసమే ప్రారంభించారు. ఇలా ప్రతి ఏటా వేలంపాటలో వచ్చిన డబ్బంతా కలిపి కోటి 44 లక్షల 77 వేల రూపాయలను ఖర్చు చేసినట్లు ఉత్సవ సమితి వెల్లడించింది. ఆ డబ్బునంతటిని గ్రామ అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేలంపాటను చూసేందుకు ప్రతి ఏటా వేలాది మంది తరలివస్తుంటారు.