PRL Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Sep 14, 2022 | 2:38 PM

కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (PRL).. 17 అసిస్టెంట్‌, జూనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ (Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

PRL Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Prl

Follow us on

PRL Ahmedabad Assistant Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (PRL).. 17 అసిస్టెంట్‌, జూనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ (Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆర్ట్స్‌/కామర్స్‌/మేనేజ్‌మెంట్‌/సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్‌ స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇంగ్లిష్‌ స్టెనోగ్రాఫీ టైపింగ్‌లో నైపుణ్యం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 26 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 1, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్‌ 7, 2022వ తేదీలోపు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులకు రూ.250లు అప్లి్కేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌/వికలాంగ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.29,900ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: RECRUITMENT SECTION ROOM NO. 003 PHYSICAL RESEARCH LABORATORY NAVRANGPURA AHMEDABAD-380 009.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu