AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMHO Mahbubabad Jobs 2022: రాత పరీక్షలేకుండా.. మహబూబాబాద్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానాల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్‌ మిషన్ కింద మహబూబాబాద్‌ జిల్లా (Mahbubabad District)లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 50 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన..

DMHO Mahbubabad Jobs 2022: రాత పరీక్షలేకుండా.. మహబూబాబాద్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానాల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
Telangana
Srilakshmi C
|

Updated on: Sep 12, 2022 | 3:52 PM

Share

DMHO Mahbubabad District Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్‌ మిషన్ కింద మహబూబాబాద్‌ జిల్లా (Mahbubabad District)లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 50 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఏఎంస్‌/బీఎస్సీ నర్సింగ్‌/స్టాఫ్‌నర్స్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 యేళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు 5, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 17, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవచ్చు. దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్ధులకు రూ.300లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్ధులకు రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. జిల్లా నియామక కమిటీ నేతృత్వంలో భర్తీ ప్రక్రియ నిర్వహిస్తారు. ఫైనల్ మెరిట్ లిస్టు అక్టోబర్‌ 3, 2022వ తేదీన విడుదల చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.29,900ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: District Medical & Health Office, Mahbubabad District, Telangana.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..