Peptic Ulcer: కడుపులో అల్సర్లు ఎందుకు వస్తాయో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే..

మన ఆహార అలవాట్లు, నిద్ర సమయాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని మీకు తెలుసా?  కొంత మంది ఉద్యోగ రిత్యా నైట్‌ డ్యూటీలు కూడా చేస్తుంటారు. ఇక ఆకలివేస్తే జంక్‌పుడ్‌ వైపు మొగ్గుచూపుతారు. ఇదే విధానం ఎక్కువ కాలం కొనసాగితే..

Peptic Ulcer: కడుపులో అల్సర్లు ఎందుకు వస్తాయో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే..
Peptic Ulcer
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 11, 2022 | 1:17 PM

Peptic ulcer symptoms: మన ఆహార అలవాట్లు, నిద్ర సమయాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని మీకు తెలుసా?  కొంత మంది ఉద్యోగ రిత్యా నైట్‌ డ్యూటీలు కూడా చేస్తుంటారు. ఇక ఆకలివేస్తే జంక్‌పుడ్‌ వైపు మొగ్గుచూపుతారు. ఇదే విధానం ఎక్కువ కాలం కొనసాగితే పొట్టనిండా గ్యాస్‌ నిండిపోయి, తిన్నది అరిగేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా జరిగితే పెద్దపేగుకు త్వరగా పుండ్లు ఏర్పడతాయి. ఇలా పేగుకు పుండ్లు పడితే ఏం తిన్నా కడుపులో మంటగా ఉంటుంది. దీనినే అల్సర్‌ అంటారు. అడ్డుఅదుపూ లేని జీవనశైలి, గాడితప్పిన ఆహారపు అలవాట్లు జీర్ణవ్యవస్థను అస్తవ్యస్తం చేసి అల్సర్లకు కారణం అవుతాయి. అందుకే టైంకి భోజనం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

అలాగే అధికంగా కారం కలిగిన ఆహారాలు అంటే.. ఫ్రైలు, మసాలా వంటకాలను తరచుగా తింటే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. ఈ మధ్యకాలంలో అధిక మంది పేగులో ఇన్‌ఫెక్షన్లు, చిన్న-పెద్ద పేగులో అల్సర్లతో భాధపడుతున్నారు. ఒక్కసారి అల్సర్‌ వస్తే అది దీర్థకాలంపాటు వేధిస్తుంది. అధికంగా పెయిన్‌ కిల్లర్‌, గ్యాస్‌ మాత్రలు ఎక్కువ కాలం వాడినా, కలుషిత ఆహారం, నీరు వంటి వాటివల్ల సాధారణంగా అల్సర్‌ వస్తుంది. స్ట్రెస్‌, ఆందోళన, ధూమపానం, ఆల్కహాల్‌ సేవించడం వల్ల పొట్టలోని మ్యూకోజ్‌ పొరకు చిరుగులు ఏర్పడి అల్సర్లకు దారితీస్తుంది. ఆహారం తీసుకున్న తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. పొట్టలో వేధించే అల్సర్లకు చికిత్స, దాని తీరుతెన్నులను గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ సోమశేఖర్‌రావు వివరించారు. అన్నం తినగానే కడుపులో నొప్పిగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఎండోస్కోపీ ద్వారా వ్యాధి తీవ్రత తెలుసుకోవచ్చు. మందులను తరచుగా వాడటం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. ఐతే మళ్లీ మళ్లీ ఇవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మసాలా వంటకాలు, కారంతో కూడిన ఆహారాలకు దూరంగా ఉంటే అల్సర్ల భారీన పడకుండా కాపాడుకోవచ్చు.

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది