- Telugu News Photo Gallery Should you eat an apple with or without its peel? Which is healthier, find out here
Apple: యాపిల్ తొక్క తీసి తింటే మంచిదా? తియ్యకుండా తింటే మంచిదా? నిపుణుల సలహా ఇదే..
రోజుకో యాపిల్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. యాపిల్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే యాపిల్ తొక్కతో తినాలా? లేక తొక్క ఒలిచిన యాపిల్స్ తినాలా? ఎలా తింటే మంచిదో తెలుసుకుందాం...
Updated on: Sep 11, 2022 | 12:38 PM

రోజుకో యాపిల్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. యాపిల్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే యాపిల్ తొక్కతో తినాలా? లేక తొక్క ఒలిచిన యాపిల్స్ తినాలా? ఎలా తింటే మంచిదో తెలుసుకుందాం...

యాపిల్స్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పదార్థాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అందుకే యాపిల్‌లను చాలా మంది తొక్కతోనే తినేస్తుంటారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యాపిల్ తొక్కతో తినడం ఆరోగ్యానికి మంచిది. యాపిల్ తొక్కలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో చేయడానికి ఉపయోగపడుతుంది.

ఐతే యాపిల్ సాగు సమయంలో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడతారు. అవి యాపిల్ తొక్కకు అంటుకుని ఉంటాయి. వీటిని నేరుగా తింటే ఆరోగ్యానికి ప్రమాదం.

కొంత మంది వ్యాపారులు యాపిల్స్ నిగనిగ లాడడానికి రంగులతో పూత వేస్తారు. యాపిల్ తొక్కతో కలిపి తింటే ఈ విష రసాయనాలు శరీరంలోకి చేరుతాయి.

ఆపిల్‌ను తినే ముందు గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టి, శుభ్రంగా కడిగిన ఆ తర్వాత తొక్కతో సహా తినవచ్చు.





























