- Telugu News Photo Gallery World Suicide Prevention Day 2022: Every 4 minutes, one commits suicide in India
Suicide in India: ప్రతి 4 నిముషాలకు ఒక ఆత్మహత్య! పురుషుల కంటే మహిళలే అధికంగా..
యువతలో ఆత్మహత్య ధోరణి రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువత అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం..
Updated on: Sep 11, 2022 | 11:39 AM

యువతలో ఆత్మహత్య ధోరణి రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువత అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచంలో ప్రతీ ఏట సుమారు 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెల్పింది. సెప్టెంబర్ 10 World Suicide Prevention Day సందర్భంగా దేశంలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల గణాంకాలు ఇవే..

2021లో ఆత్మహత్య కేసులు 1.64 లక్షలకు పెరిగితే, 2020లో ఈ సంఖ్య 1.53 లక్షలకు చేరింది

గణాంకాల ప్రకారం.. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు

మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక ఆత్మహత్య కేసులు నమోదవుతున్నాయి

2021లో 18-30 ఏళ్లలోపు యువకుల ఆత్మహత్యల సంఖ్య అత్యధికంగా నమోదైంది





























