DMHO Sangareddy Jobs 2022: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లోని పట్టణ, గ్రామ దవాఖానాల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 102 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

DMHO Sangareddy Jobs 2022: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
Telangana Govt
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 11, 2022 | 8:01 AM

DMHO Sangareddy District MLHP Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లోని పట్టణ, గ్రామ దవాఖానాల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 102 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంబీబీఎస్‌తోపాటు ఎంబీబీఎస్‌/బీఏఎంస్‌/బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణత సాధించి సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్ధులకు రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 17, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ అక్టోబర్‌ 3, 2022వ తేదీన విడుదల అవుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.29,900ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్‌: District Medical & Health Office, Sangareddy District, Telangana.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.