AP Schools: పాఠశాల విద్యార్ధులకు టోల్‌ ఫ్రీ నంబర్‌ జారీ చేసిన ఏపీ సర్కార్.. ఇకపై స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు వారికి కూడా..

ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన క్యాంప్‌ సీఎం వైయస్‌ జగన్‌ ఈరోజు (సెప్టెంబర్‌ 12) సమీక్ష నిర్వహించారు. నాడు - నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్ల ఆడిట్ వివరాలను ఈ సమీక్షలో విద్యాశాఖ అధికారులు సీఎంకు..

AP Schools: పాఠశాల విద్యార్ధులకు టోల్‌ ఫ్రీ నంబర్‌ జారీ చేసిన ఏపీ సర్కార్.. ఇకపై స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు వారికి కూడా..
Andhra CM YS Jagan
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 12, 2022 | 3:11 PM

AP CM Jagan Reviews on Nadu-Nedu: ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన క్యాంప్‌ సీఎం వైయస్‌ జగన్‌ ఈరోజు (సెప్టెంబర్‌ 12) సమీక్ష నిర్వహించారు. నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్ల ఆడిట్ వివరాలను ఈ సమీక్షలో విద్యాశాఖ అధికారులు సీఎంకు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఈ విధంగా మాట్లాడారు.. ‘నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై – ప్రతి నెలా ఆడిట్‌ నిర్వహించాలి. స్కూళ్లకు కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అన్నది పరిశీలన చేయాలి. అలాగే అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేయించాలి. స్కూళ్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌ను వాడుకుని స్కూళ్ల నిర్వహణలో ఎలాంటి తేడాలు లేకుండా చూసుకోవాలి. ఎలాంటి సమస్యలున్నా తెలియజేయడానికి వీలుగా ప్రతి స్కూల్‌లో టోల్‌ ఫ్రీ నంబర్‌ 14417 విద్యార్ధులకు కనిపించేలా ప్రదర్శించాలి. వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందజేయాలి. యూనిఫామ్‌ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో జమ కావాలని’ సీఎం జగన్‌ అదికారులను ఆదేశించారు. సీఎం జగన్‌ తాజా ఆదేశాల్లో భాగంగా సచివాలయ ఉద్యోగులు స్కూళ్ల నిర్వహణలో భాగస్వామ్యం కానున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.