MLC Kavitha: తొలిసారి ఆస్ట్రేలియన్ పార్లమెంటు హౌస్‌లో బతుకమ్మ వేడుకలు.. ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం..
బతుకమ్మ పండగ ఖ్యాతి ఖండాతరాల్లో కూడా వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది.
MLC Kavitha: దసరా పండగ వస్తుందంటే చాలు తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండగ ఖ్యాతి ఖండాతరాల్లో కూడా వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. వివరాల్లోకి వెళ్తే..
బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్త చేసి, బతుకమ్మ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఎమ్మెల్సీ కవితకి మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. ఈ నెల 25 న ఆస్ట్రేలియాలో జరగనున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ప్రవాస భారతీయులు ఆహ్వానించారు. ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్ట్ (FINACT) అధ్వర్యంలో తొలిసారిగా ఆస్ట్రేలియన్ పార్లమెంటు హౌస్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కవితను FINACT అధ్యక్షులు డా.శాంతిరెడ్డి ఆహ్వానించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో పలువురు ఆస్ట్రేలియా ఎంపీలు కూడా పాల్గొననున్నారు.
మరోవైపు కవిత కోవిడ్ బారిన పడ్డారు. గత రెండు రోజులుగా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
మరిన్ని గ్లోబల్ ఇండియన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..