Viral News: బ్రెయిన్ డెడ్ అని సర్జరీ మొదలుపెట్టిన డాక్టర్లు.. కట్ చేస్తే.. ఎదురైన అనుభవానికి అందరూ షాక్!
తన భర్త ర్యాన్ వద్దకు వెళ్లి అతని చేతిని తాకింది. అతనితో మాట్లాడింది.. వెంటనే ర్యాన్ హృదయ స్పందన మొదలైంది.. ఈ విషయం మేఘన్ గుర్తించింది.
Viral News: వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు.. వైద్యులు భూమిపై దేవుని స్వరూపంగా పరిగణించబడుతున్నారు. కీర్తించబడుతున్నారు. అయినప్పటికీ మరణించిన వ్యక్తులను మాత్రం బ్రతికించే శక్తి డాక్టర్లకు కూడా లేదు. అయితే కొన్నిసార్లు ఊహకు అందని అద్భుతాలు జరుగుతాయి. అవి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఒకొక్కసారి మరణించినట్లు ప్రకటించిన తర్వాత అటువంటి వారికీ జీవం వస్తుంది. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఘటనే ఒకటి చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి.. ఒక మహిళ భర్త చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఆ మహిళ తన భర్తను తాకగానే.. ఆ భర్త గుండె చప్పుడు తిరిగి మొదలైంది. ఈ వింత ఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటు చేసుకుంది.
మీడియా కథనాల ప్రకారం రియాన్ మార్లో అనే వ్యక్తి లిస్టిరియోసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో గత నెలలో ఆసుపత్రిలోని ఎమెర్జెన్సీ వార్డు లో చేరాడు. తర్వాత అతని మెదడు వాచిపోయి కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో వైద్యులు రియాన్ ను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. వాస్తవానికి.. నార్త్ కరోలినాలో ఒక వ్యక్తి మెదడు పనిచేయడం ఆగిపోయినట్లయితే.. అతను చనిపోయినట్లు ప్రకటించవచ్చు అనే చట్టం ఉంది. ఈ చట్టం ఆధారంగా.. వైద్యులు ర్యాన్ చనిపోయినట్లు ప్రకటించారు. రియాన్ మార్లో భార్య మేఘన్ ర్యాన్ కు ఈ మేరకు సమాచారం అందించారు ఆస్పత్రి వైద్య సిబ్బంది.
తన భర్త వార్త మేఘన్ కు షాక్ ఇచ్చింది. భర్త మరణ విషాదం తట్టుకుని తన భార్య అవయవాలను దానం చేయాలనుకున్నట్లు వైద్యులకు చెప్పింది. అనంతరం అవయవదాన ప్రక్రియ ప్రారంభమైంది. అయితే శస్త్రచికిత్సకు ముందు.. మేఘన్ మేనల్లుడు ర్యాన్ వద్దకు వెళ్లి.. పిల్లలతో ఆడుకుంటున్న ర్యాన్ వీడియోను ప్లే చేశాడు. అప్పుడు షాకింగ్ గా ర్యాన్ కాళ్లలో కదలిక మొదలైంది. ఈ విషయం తెలిసి మేఘన్ ఏడవడం మొదలుపెట్టింది. తన భర్త జీవించి ఉన్నాడని ఆమె నమ్మకపోయినా.. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల్లో ఇలాంటివి జరుగుతాయని ఆమెకు తెలుసు. అయినప్పటికీ మేఘన్.. తన భర్తకు మళ్ళీ కొన్ని పరీక్షలు చేయించింది.
పరీక్షలో ర్యాన్‌కు నాడీ సంబంధిత మరణం లేదని వెల్లడింది. అంతేకాదు ర్యాన్ మెదడులో రక్త ప్రవాహం కొనసాగుతోందని గుర్తించారు. అనంతరం తన భర్త ర్యాన్ వద్దకు వెళ్లి అతని చేతిని తాకింది. అతనితో మాట్లాడింది.. వెంటనే ర్యాన్ హృదయ స్పందన మొదలైంది.. ఈ విషయం మేఘన్ గుర్తించింది. వెంటనే వైద్యులు ర్యాన్ ను వైద్యులు పరీక్షించి.. ర్యాన్ బ్రెయిన్ డెడ్ కాదని.. కోమాలో ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ ర్యాన్ పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. తన భర్త కళ్లు తరవాలని భార్య మేఘన్ కోరుకుంటుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..