AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 43 ఏళ్లలో 53 పెళ్లిళ్లు.. ఇక పెళ్లిళ్లు వద్దు బాబోయ్ అంటోన్న ఈ నిత్య పెళ్లికొడుకు లీలలు అన్నీ ఇన్నీ కావు

తనకు, తన భార్యలకు మధ్య చాలా సమస్యలు ఉన్నాయని అబూ చెప్పాడు. మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోమని రెచ్చగొడుతున్న కారణం ఇదే. దీంతో 43 ఏళ్లలో 53 మంది మహిళలను పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నాడు.

Viral News: 43 ఏళ్లలో 53 పెళ్లిళ్లు.. ఇక పెళ్లిళ్లు వద్దు బాబోయ్ అంటోన్న ఈ నిత్య పెళ్లికొడుకు లీలలు అన్నీ ఇన్నీ కావు
Saudi Arab Mam Marriages
Follow us
Surya Kala

|

Updated on: Sep 17, 2022 | 4:39 PM

Viral News:  సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి 43 ఏళ్లలో 53 పెళ్లిళ్లు చేసుకుని భిన్నమైన రికార్డు సృష్టించాడు. ఈ వివాహాల వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ,  శాంతి, స్థిరత్వం కోసమే ఇన్ని వివాహాలు చేసుకున్నానని చెబుతున్నాడు ఆ వృద్ధుడు. పెళ్లి మీద పెళ్లి చేసుకుని రికార్డు సృష్టించిన 63 ఏళ్ల వృద్ధుడు ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవడానికి చెప్పిన కారణం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తనను సంతోషంగా ఉంచే అమ్మాయిని వెతికేందుకే ఈ పెళ్లిళ్లు చేసుకున్నానని ఆ వ్యక్తి చెబుతున్నాడు.

గల్ఫ్ న్యూస్‌లో ప్రచురించిన వార్త ప్రకారం.. ఆ నిత్యపెళ్లి కొడుకు పేరు అబూ అబ్దుల్లా. తన కథను వివరిస్తూ.. అబూ అబ్దుల్లా తాను మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు.. అసలు రెండో వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదని చెప్పారు. ఆ సమయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని, మాకు ఒక పాప కూడా ఉందని గుర్తు చేసుకున్నారు. తర్వాత అబూ 23 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తన వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ వ్యక్తి తన భార్యలందరితో నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు.

గొడవల కారణంగా వివాహాలు: తనకు, తన భార్యలకు మధ్య చాలా సమస్యలు ఉన్నాయని అబూ చెప్పాడు. మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోమని రెచ్చగొడుతున్న కారణం ఇదే. దీంతో 43 ఏళ్లలో 53 మంది మహిళలను పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నాడు. తాను కేవలం 20 సంవత్సరాల వయస్సులో మొదటిసారి వివాహం చేసుకున్నాను.. అప్పుడు నా భార్య నా కంటే 6 సంవత్సరాలు పెద్దదని పేర్కొన్నాడు. అసలు  తాను ప్లాన్ చేసి  పెళ్లిళ్లు చేసుకోలేదన్నాడు అబూ.. భార్యలతో విసిగిపోయి, ప్రతిసారీ బలవంతంగా ఈ పెళ్లిమీద పెళ్లి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు అబూ అబ్దుల్లా.

ఇవి కూడా చదవండి

ఇక పెళ్లి చేసుకోను: అబ్దుల్లా తాను చేసుకున్నపెళ్లిళ్లు చాలా వరకు సౌదీ మహిళలతోనే జరిగాయని చెప్పారు. ‘కొంతమంది విదేశీ మహిళలను పెళ్లి చేసుకున్నాను’ అని చెప్పాడు. విదేశీ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న తర్వాత న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పాడు. ఇక 53 పెళ్లిళ్లు చాలు.. ఇక మరో పెళ్లి చేసుకోను అంటున్నాడు ఈ నిత్య పెళ్ళికొడుకు 63 ఏళ్ల వృద్ధుడు అబ్దుల్లా.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..