Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోడ్డుపై ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి.. షాకింగ్ వీడియో వైరల్

ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వీడియో క్యాప్షన్‌లో రాసి ఉంది. అందుకే రోడ్డును దాటే సమయంలో చూస్తూ క్రాస్ చేయాలని, వాహనాలు అతివేగంతో వెళ్లే ప్రాంతంలో రోడ్డుని దాటడానికి ప్రయత్నించవద్దని చెబుతున్నారు.  

Viral Video: రోడ్డుపై ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి.. షాకింగ్ వీడియో వైరల్
Hyderabad Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 18, 2022 | 3:41 PM

Viral Video: ఓ వైపున ప్రభుత్వాలు, అధికారులు సామజిక కార్యకర్తలు ఈ పనులు చేయవద్దు అవి మీకు సమాజానికి హానికరం అంటూ హెచ్చరిస్తూనే ఉంటారు. అయితే అటువంటి హెచ్చరికలను సూచనలను పెట్టుకోకుండా తమ దారిన తాము వెళ్లే వ్యక్తులకు లోకంలో కొరత లేదు. ముఖ్యంగా భారతదేశంలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. ‘ఇక్కడ చెత్త వేయటం నిషేధం’ అని గోడలపై రాసి ఉంటుంది.. అయితే ఆ గోడకు అనుకునే చెత్తను పారబోస్తూ వెళ్లేవాళ్ళు మీరు చూసే ఉంటారు. రోడ్లపై కూడా ఇటువంటి దృశ్యాలు తరచుగా కనిపిస్తుంటాయి. రోడ్లపై నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి నిర్లక్ష్యంగా రోడ్డు దాటుతున్నారు. పాదచారులు రోడ్డు దాటేందుకు అండర్‌గ్రౌండ్‌, బ్రిడ్జిలు నిర్మించినా వాటిని పట్టించుకునేవారు పెద్దగా ఉండరు. హడావిడిగా తమకు తోచిన చోట రోడ్డుని దాటుతూ ఉంటారు. అప్పుడు అనుకోని ప్రమాదాలకు గురై ప్రాణాలను పోగొట్టుకుంటారు. ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది .

ఈ వీడియోలో, ఒక వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి రోడ్డు దాటుతుండగా.. కార్లు, బైక్‌లు రోడ్డు మీద అత్యంత వేగంతో వెళ్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో  ఓ ప్రయాణీకుడు రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన బైక్ గుద్దుకుని ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై వాహనాలు అతివేగంతో వెళ్తుండడం ఓ వ్యక్తి నడుచుకుంటూ రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. అంతలో వేగంగా వస్తున్న ఓ బైక్‌ రైడర్‌ అతడిని ఢీకొట్టాడు. అంతేకాదు.. ఆ వాహనదారుడు రోడ్డు మీద పడిపోయాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ట్రక్కు అతనిపైకి ఎక్కింది. ఒక్క చిన్న సంఘటనతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అని ఇప్పుడు మీరే అనుకుంటున్నారా?

ఇవి కూడా చదవండి

ముగ్గురు వ్యక్తులకు యాక్సిడెంట్ వీడియో: 

ఈ దారుణ ఘటన హైదరాబాదులో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో @siddharthk63 అనే ఐడితో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ప్రమాదంలో బైక్ రైడర్‌తో పాటు కాలినడకన రోడ్డు దాటుతున్న వ్యక్తితో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.

ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వీడియో క్యాప్షన్‌లో రాసి ఉంది. అందుకే రోడ్డును దాటే సమయంలో చూస్తూ క్రాస్ చేయాలని, వాహనాలు అతివేగంతో వెళ్లే ప్రాంతంలో రోడ్డుని దాటడానికి ప్రయత్నించవద్దని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..