Viral Video: క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియల్లో షాకింగ్‌ సీన్‌..! కింగ్‌ చార్లెస్‌ కారుని ఢీ కొట్టబోయాడు..! వైరలవుతున్న వీడియో..

వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో ఉన్న రాణి శవపేటిక వద్దకు చార్లెస్‌ వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Viral Video: క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియల్లో షాకింగ్‌ సీన్‌..! కింగ్‌ చార్లెస్‌ కారుని ఢీ కొట్టబోయాడు..! వైరలవుతున్న వీడియో..
Roller Skating
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 18, 2022 | 3:50 PM

Viral Video: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల సందర్భంగా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. రాణి అంత్యక్రియల సందర్భంగా కింగ్‌ చార్లెస్‌ కారును ఢీకొట్టాడు స్కేటింగ్‌ చేస్తున్న ఓ వ్యక్తి..జరిగిన సంఘటనతో సదరు వ్యక్తి భయంతో వణికిపోయాడు.. బ్రిటన్‌లో రోలర్‌ స్కేటింగ్‌ చేస్తున్న ఓ వ్యక్తి కింగ్‌ చార్లెస్‌ కారుని ప్రమాదవశాత్తు ఢీ కొట్టాడు. వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో ఉన్న రాణి శవపేటిక వద్దకు చార్లెస్‌ వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

లండన్‌లోని పార్లమెంట్‌ స్క్వేర్‌ సమీపంలో రాయల్‌ అశ్వికదళం వైపు రోలర్‌ స్కేట్‌లపై వేగంగా వెళ్తున్న వ్యక్తిని సుమారు ఎనిమిది మంది పోలీసులు అడ్డుకున్నారు. విచారణ జరిపిన అధికారులు వాస్తవానికి అతనికి ఎలాంటి దుర్దేశాలు లేవని నిర్థారించారు. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ పోలీసులు మాట్లాడుతూ…

ఇవి కూడా చదవండి

రాత్రి 7 గంటల సమయంలో పోలీసు వాహనాలు పార్లమెంట్‌ స్క్వేర్‌లోకి ప్రవేశిస్తుండగా ఒక పాదచారి రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలోనే సదరు వ్యక్తి ప్రమాదవశాత్తు చార్లెస్‌ కారుని దాదాపు ఢీ కొట్టాడని చెప్పారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా అతనికి ఎలాంటి దురుద్దేశం లేదని, ఈ ఘటన అనుకోకుండా జరిగిందేనని ధృవీకరించారు.

కింగ్ చార్లెస్, అతని తోబుట్టువులు – ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్సెస్ అన్నే, ప్రిన్స్ ఎడ్వర్డ్ – వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లోని వారి తల్లి శవపేటికను ప్రిన్సెస్ జాగరణ అని పిలిచే కార్యక్రమంలో నిశ్శబ్దం పాటించేదుకు వెళ్తుండగా ఇది జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి