Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: లక్షలాది చీమల దండయాత్ర.. హడలిపోతున్న గ్రామస్తులు.. ఈసారి మన తెలుగు రాష్ట్రంలోనే..

ఈ చీమల కారణంగా మేమిక్కడ బతకలేం. ప్రశాంతంగా తినలేక పోతున్నాం. పడుకోలేక పోతున్నాం. కనీసం ఎక్కడైనా కూర్చుందామన్నా ఒంటిపైకి జరజర పాకేస్తున్నాయని వాపోతున్నారు. పిల్లలైతే

Andhra Pradesh: లక్షలాది చీమల దండయాత్ర.. హడలిపోతున్న గ్రామస్తులు.. ఈసారి మన తెలుగు రాష్ట్రంలోనే..
Ants
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 18, 2022 | 2:33 PM

Andhra Pradesh: జస్ట్ చీమే కదా? నలిపేస్తే పోయేదానికి ఇంత టెన్షనా? అంటే అక్కడి వాళ్లు ఒప్పుకోరు. మేం పడుతోన్న చీమల బెడద గురించి మీకేం తెలుసని అంటారు. అంతగా అక్కడ చీమల దండయాత్ర సాగుతోంది. అదెక్కడో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..

చెట్టూ పుట్టా తేడా లేదు.. ఆ ఊళ్లో ఎటు చూసినా చీమలే చీమలు.. దీంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఎరుపు రంగులో ఉండే ఈ చీమలు కుట్టవు కానీ. శరీరంపైకి ఎగబాకడం కూడా ఏమంత తెలీదు కానీ.. ఇవి ఒంటిపైకి ఎక్కాక నోటితో ఏదో రసాయనాన్ని విడుస్తున్నాయి. దీంతో బాడీ అంతా చర్మ సంబంధ వ్యాధి వచ్చినట్టు అవుతోందని వాపోతున్నారిక్కడి వారు. చిన్న చిన్న పొక్కులు ఏర్పడ్డం.. వాటిని గీకితే పెద్ద గాయాలవడం. వీటితో పాటు కొన్ని సార్లు జ్వరాలు రావడం కూడా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారీ గ్రామస్తులు.

ఈ చీమలు పశువులను కూడా వదలడం లేదనీ. పశుగ్రాసంలోనూ చీమలుండటంతో.. దాణా తీసుకోవడం వీలు కాక.. ఈ జీవులు బక్క చిక్కిపోతున్నాయనీ అంటున్నారిక్కడివాళ్లు. ఈ చీమలెంత మొండి ఘటాలంటే.. క్రిమికీటకాలనే కాదు పాములను కూడా బతికుండగానే చంపి తినేస్తున్నాయనీ అంటున్నారు. ఈ చీమల కారణంగా మేమిక్కడ బతకలేం. ప్రశాంతంగా తినలేక పోతున్నాం. పడుకోలేక పోతున్నాం. కనీసం ఎక్కడైనా కూర్చుందామన్నా ఒంటిపైకి జరజర పాకేస్తున్నాయని వాపోతున్నారు. పిల్లలైతే ఆడుకోలేక చదువుకోలేక అవస్త పడుతున్నారనీ. ఇంట్లో ఏదీ నిల్వ ఉంచుకోడానికి వీల్లేక పోతోందనీ. ఇంట్లో ఊడిస్తే దుమ్ము ధూళికి బదులు చనిపోయిన చీమలొస్తున్నాయనీ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ గ్రామం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్వగ్రామం తొగరాం పంచాయితీ కిందకు వస్తుంది. స్పీకర్ సతీమని వాణి గ్రామ సర్పంచ్. దీంతో ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీస్కెళ్లారు. కలెక్టర్ గ్రీవెన్స్ కి కూడా తీసుకెళ్లారు. దీంతో అధికారులు స్పందించారు. ఊరిని సందర్శించారు. ఊరంతా బ్లీచింగ్ చల్లి, రసాయనాలను స్ప్రే చేశారు. అప్పటికీ ఇక్కడి చీమలు ఏ మాత్రం తగ్గలేదు. దీంతో చేసేది లేక ఊళ్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. గ్రామంలో చీమల సంచారం పెరగటానికి భౌగోళిక పరిస్థితులే కారణమన్న ప్రాధమిక అంచనాకు వచ్చారు. గ్రామం ద్వారా నాగావళి నది ప్రవహించడం. చెట్లు తుప్పలు తోటలు అధికంగా ఉండటం.. వల్ల చీమలకీ ప్రాంతం అనువుగా ఉందని భావిస్తున్నారు.

ఇసుక పేటలో రెండేళ్ల నాటి నుంచీ ఈ చీమల బెడద మొదలైంది. మొదట్లో ఇవి పొలాలు, పశువుల కొట్టాలు, నాగావళి గట్టుకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఇటీవలే గ్రామంలో ఏ ఇంట చూసినా.. ప్రత్యక్షమవుతున్నాయి. నానాటికీ పెరిగి పెరిగి ఊరంతా చీమల మయంగా మారిపోయింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి