Bank Jobs: కడప జిల్లా సహకార బ్యాంకులో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Bank Jobs: కడప జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు...
Bank Jobs: కడప జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకుగాను ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏ విభాగంలో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ, సీఏఐఐబీ/డీబీఎఫ్/డిప్లొమా(సీబీఎం) లేదా సీఏ లేదా పీజీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు బ్యాంకింగ్ సెక్టార్‌లో ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 62 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను మేనేజింగ్ డైరెక్టర్ ది ఎ.పి.స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఎన్టీఆర్ సహకార భవన్, డోర్ నెం.272928, గవర్నర్‌పేట్, విజయవాడ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు గడువు 13-09-2022తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..