shocking news: అటవీ ప్రాంతంలో అనుమానాస్పద గొయ్యి.. దగ్గరకెళ్లి చూస్తే నిండా మృతదేహాలే.. ఎక్కడంటే..

ఒకే చోట వందల సంఖ్యలో మృతదేహాలు బయటపడ్డాయి. అటవీప్రాంతంలో గొయ్యిలో పారవేసిన దాదాపు 440కి పైగా మృతదేహాలు కలకం రేపుతున్నాయి. ఈ హృదయ విదారక ఘటన

shocking news: అటవీ ప్రాంతంలో అనుమానాస్పద గొయ్యి.. దగ్గరకెళ్లి చూస్తే నిండా మృతదేహాలే.. ఎక్కడంటే..
Ukraine's Izium
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 16, 2022 | 1:54 PM

shocking news : ఇదో భయానక దృశ్యం.. చూసిన ఎవరికైనా సరే భయంతో ఒళ్లు గగ్గొర్పోడిచేలా చేస్తుంది. ఒకేచోట గుట్టలు గుట్టలుగా పడివున్న శవాలు అక్కడి వారిని వణికింపజేస్తున్నాయి. ఒకటి రెండు కాదు.. ఒకే చోట వందల సంఖ్యలో మృతదేహాలు బయటపడ్డాయి. అటవీప్రాంతంలో గొయ్యిలో పారవేసిన దాదాపు 440కి పైగా మృతదేహాలు కలకం రేపుతున్నాయి. ఈ హృదయ విదారక ఘటన ఉక్రెయిన్ లోని ఇజియం ప్రాంతంలో వెలుగుచూసింది. అక్కడి శివారు అటవీ ప్రాంతంలో ఉన్న గొయ్యిలో 440కి పైగా మృతదేహాలు బయటపడ్డాయని.. ఉక్రెయిన్ సీనియర్ దర్యాప్తు అధికారి ఒకరు మీడియాకు ఈ విషయం వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకు పదుల సంఖ్యలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రష్యాదాడులకు ఏ మాత్రం తగ్గకుండా అందుకు ధీటుగా సమాధానం చెబుతోంది ఉక్రెయిన్‌. ఇటీవలే రష్యా దళాలను వెళ్లగొట్టి ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద ప్రాంతమైన ఖర్కివ్‌ను కీవ్‌ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. తమ అధీనంలోకి వచ్చిన ఆ ప్రాంతాన్ని తాజాగా అధికారులు పరిశీలించగా ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు వెలుగుచూస్తున్నాయి. ఒకే చోట గొయ్యిలో వందల కొద్దీ మృతదేహాలను అధికారులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఇజియం శివారు అటవీ ప్రాంతంలోని ఓ గొయ్యిలో 440కి పైగా మృతదేహాలు ఉన్నట్లు తూర్పు ఖర్కివ్‌ ప్రాంతంలోని సీనియర్ దర్యాప్తు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. వీరిలో కొందరు తుపాకీ గాయాలతో చనిపోగా.. మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. వీరిలో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. కొన్ని మృతదేహాలపై తీవ్రంగా హింసించిన గుర్తులు ఉన్నట్టుగా చెప్పారు. బుచా, మెరియుపోల్ తర్వాత.. ఖర్కివ్ లో దారుణ పరిస్థితులు కళ్లకు కట్టినట్లు కనిపించాయని, దీనంతటికీ రష్యానే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

ఉక్రెయిన్‌లో రష్యా సృష్టించిన మారణహోమం ప్రపంచానికి తెలియాలన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యన్ ఆక్రమణ దేనికి దారితీసిందో ప్రపంచం తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము..అని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..