AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral video: అమ్మమ్మా మజాకా.. తాతను వెనకాల కూర్చోబెట్టుకుని బైక్‌పై రయ్‌మంటూ దూసుకెళ్తోంది..

ఐతే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఇది దాదాపు 3 మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షించింది. 3 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

viral video: అమ్మమ్మా మజాకా.. తాతను వెనకాల కూర్చోబెట్టుకుని బైక్‌పై రయ్‌మంటూ దూసుకెళ్తోంది..
Granny Riding Bike
Jyothi Gadda
|

Updated on: Sep 16, 2022 | 12:17 PM

Share

Viral Video: నైపుణ్యం అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు. నైపుణ్యం అనేది అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. అభ్యాసానికి లింగ వివక్ష లేదు. వయస్సు వివక్ష అసలే అడ్డుకాదు..కావలసింది సంకల్పం. నగరవాసులు కూడా మా జీవితం మా ఇష్టం అనే ధైర్యంతో జీవిస్తున్నారు. గ్రామస్తులు కూడా ఈ మార్పుకు తెరలేపారు అనడానికి ఈ వీడియోనే నిదర్శనం. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..ఒక వృద్ధ మహిళ తన భర్తను బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లడం కనిపించింది. ఈ మధుర క్షణానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వృద్ధ మహిళ తన భర్తను తన వెనుక కూర్చోబెట్టుకుని మోటార్‌సైకిల్‌పై వెళుతున్న వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సాధారణంగా ప్రతీచోటా భార్య వెనుక కూర్చొని భర్త బైక్‌ డ్రైవ్‌ చేస్తూ ప్రయాణం చేయడం సర్వసాధారణం. ఇప్పుడు కూడా భార్యాభర్తలు ఓ చిన్నపాటి బైక్‌పై వెళ్తున్నారు. అయితే ఈ వృద్ధురాలు తన భర్తను వెనుక కూర్చోబెట్టుకుని టూవీలర్‌ నడపడం చాలా అరుదు. ఐతే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఇది దాదాపు 3 మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షించింది. 3 లక్షల మందికి పైగా లైక్ చేశారు. సుస్మితా డోరా అనే ఫోటోగ్రాఫర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి కపుల్ గోల్స్ అనే టైటిల్ పెట్టారు.సోనూ నిగమ్, శ్రేయా ఘోషల్ పాడిన తేరే బిన్ పాటతో వీడియో ప్రారంభమవుతుంది. ఇంత ఆత్మవిశ్వాసంతో డ్రైవింగ్ చేస్తున్న ఈ వృద్ధురాలిని చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక వీడియో చూసిన నెటిజన్లు తమ మనసుకు హత్తుకునేలా ఉందంటున్నారు. మీరిద్దరూ బాగుండాలి అమ్మమ్మా. మీ జీవిత ప్రయాణం ఇలాగే సాగాలని కోరుకుంటూ భిన్నమైన కామెంట్స్‌తో వారిని అభినందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి