Viral Video: చిరుతపులి, కొండ చిలువ మధ్య భీకర పోరు.. చివరికి గెలిచిందెవరో తెలుసా?

Leopard vs Python : డేగ కళ్లతో పంజా విసిరే చిరుత పులి ఎలాంటి జంతువున్నైనా ఇట్టే చీల్చిపారేయగలదు. ఇక కొండ చిలువ.. తన బలంతో శరీరాన్ని చుట్టేసి ఊపిరాడకుండా చేయగలదు. పెద్ద జంతువునైనా అమాంతం మింగేయగలదు కూడా. ఈ రెండూ శక్తివంతమైన జంతువులే. క్రూరమైనవి కూడా.

Viral Video: చిరుతపులి, కొండ చిలువ మధ్య భీకర పోరు.. చివరికి గెలిచిందెవరో తెలుసా?
Leopard Vs Python
Follow us
Basha Shek

|

Updated on: Sep 16, 2022 | 11:14 AM

Leopard vs Python : డేగ కళ్లతో పంజా విసిరే చిరుత పులి ఎలాంటి జంతువున్నైనా ఇట్టే చీల్చిపారేయగలదు. ఇక కొండ చిలువ.. తన బలంతో శరీరాన్ని చుట్టేసి ఊపిరాడకుండా చేయగలదు. పెద్ద జంతువునైనా అమాంతం మింగేయగలదు కూడా. ఈ రెండూ శక్తివంతమైన జంతువులే. క్రూరమైనవి కూడా. మరి అలాంటి జంతువులు ఒకరికొకరు తారస పడితే.. నువ్వానేనా అన్నట్లు తలపడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్‌ మీడియాలో ఈ జంతువుల పోరాటానికి సంబంధించిన వీడియోలు అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో ఆకలితో ఉన్న ఓ చిరుత పులి కొండచిలువను చూస్తుంది. వెంటనే దానిని ఆహారంగా మార్చుకునేందుకు వెంట పడుతుంది. కొండచిలువపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ప్రతిగా కొండ చిలువ కూడా చిరుతపై దాడికి దిగుతుంది. తనకు మాత్రమే సాధ్యమయ్యే బలంతో పులిని గట్టిగా చుట్టేస్తుంది.

ఇలా ఒకరిపై మరొకరు పైచేయి సాధించడంలో భీకరంగా పొట్లాడుతాయి ఈ రెండు జంతువులు. సాధారణంగా చిరుత తన పంజాతో ఎలాంటి జంతువున్నైనా చంపేయగలదు. కానీ ఇక్కడ కొండ చిలువ చుట్టేయడంతో చిరుత ఊపిరితీసుకోలేకపోయింది. ప్రాణం మీద ఆశ రేగింది. దాని నుంచి తప్పించుకునేందుకు అష్టకష్టాలు పడింది. చివరకు ఎలాగోలా కొండచిలువ నుంచి తప్పించుకుని బతుకుజీవుడా అంటూ వెళ్లిపోయింది. వరల్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ విలేజ్ అనే ఖాతా ద్వారా ఈ వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..