Ashu Reddy: బర్త్‌డే రోజున ఖరీదైన బెంజ్‌ కారును గిఫ్ట్‌గా అందుకున్న అషురెడ్డి.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Ashu Reddy Birthday: సెప్టెంబర్‌ 15 అషు పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన తండ్రి నుంచి మెర్సిడీజ్ బెంజ్ కంపెనికి చెందిన C200D మోడల్‌ కారును బహుమతిగా అందుకుంది. అనంతరం ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుని మురిసిపోయింది.

Ashu Reddy: బర్త్‌డే రోజున ఖరీదైన బెంజ్‌ కారును గిఫ్ట్‌గా అందుకున్న అషురెడ్డి.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Ashu Reddy
Follow us
Basha Shek

|

Updated on: Sep 15, 2022 | 6:39 PM

Ashu Reddy Birthday: జూనియర్‌ సామ్‌గా సోషల్‌ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది అషురెడ్డి (Ashu Reddy). ఆ తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టి బోలెడంత క్రేజ్‌ తెచ్చుకుంది. అదే పాపులారిటీతో కొన్ని టీవీ షోస్‌లోనూ కనిపించి మెప్పించింది. అన్నిటికీ మించి ప్రముఖ దర్శకుడు ఆర్టీవీతో చేసిన బోల్డ్‌ ఇంటర్వ్వూ ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది. హాట్‌ హాట్‌ ఫొటోషూట్లతో ఫ్యాన్స్‌ను, ఫాలోవర్లను అలరిస్తోన్న ఈ అందాల తార తాజాగా ఓ సర్‌ ప్రైజింగ్‌ గిఫ్ట్ అందుకుంది. సెప్టెంబర్‌ 15 అషు పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన తండ్రి నుంచి మెర్సిడీజ్ బెంజ్ కంపెనికి చెందిన C200D మోడల్‌ కారును బహుమతిగా అందుకుంది. అనంతరం ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుని మురిసిపోయింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ashu Reddy (@ashu_uuu)

తండ్రితో కలిసి కారు ముందు ఫోజులు ఇచ్చిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ‘అమ్మా క్షమించు.. నువ్వు షాక్‌ అవ్వకు.. ఇది డాడీ సర్‌ప్రైజ్‌’ అంటూ లవ్‌ ఎమోజీలను షేర్‌ చేసింది. అలాగే మరో పోస్టులో ‘ఈ సంవత్సరంలో నేను అందుకున్న సర్ ఫ్రైజ్ బహుమతి’ అది అని రాసుకొచ్చింది. కాగా అషు గిఫ్ట్‌గా అందుకున్న ఈ కారు విలువ రూ. 70 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్‌ చెబుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by Ashu Reddy (@ashu_uuu)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..