Viral Video: చిన్నారి ట్యాలెంట్‌కు ఫిదా అయిన శ్రీవల్లి.. ఎలాగైనా కలవాలని రిక్వెస్ట్

Basha Shek

Basha Shek |

Updated on: Sep 14, 2022 | 6:08 PM

Rashmika Mandanna: టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించిన చిత్రం పుష్ప: ది రైజ్. గతేడాది డిసెంబర్‌లో ఈ సినిమా విడుదలై సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక అందులోని పాటలు, డైలాగులు, ఫైట్లు ఓ రేంజ్‌లో హిట్టయ్యాయి. పిల్లల నుంచి పెద్దల వరకు,

Viral Video: చిన్నారి ట్యాలెంట్‌కు ఫిదా అయిన శ్రీవల్లి.. ఎలాగైనా కలవాలని రిక్వెస్ట్
Rashmika Mandanna

Rashmika Mandanna: టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించిన చిత్రం పుష్ప: ది రైజ్. గతేడాది డిసెంబర్‌లో ఈ సినిమా విడుదలై సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక అందులోని పాటలు, డైలాగులు, ఫైట్లు ఓ రేంజ్‌లో హిట్టయ్యాయి. పిల్లల నుంచి పెద్దల వరకు, విదేశీ స్టార్లు, క్రికెటర్లు పుష్ప పాటలు, డైలాగులను రీక్రియేట్‌ చేసి ఆకట్టుకున్నారు. అయినా ఇంకా ఈ సినిమా క్రేజ్ తగ్గడం లేదు. అక్కడడక్కడా ఈ సినిమా పాటలు, డైలాగులు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా పుష్ప మూవీలోని సామీ సామీ సాంగ్ కి ఓ మూడేళ్ల చిన్నారి అద్భుతంగా డాన్స్ చేసింది. స్కూల్‌ డ్రస్‌లో ఉన్న ఆ పాప ఒరిజినల్‌ సాంగ్‌లోని రష్మికను అనుకరించే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్‌తో అదిరిపోయే ఫెర్మామెన్స్‌ ఇచ్చింది. ఈ చిన్నారి డ్యాన్స్‌ వీడియోను ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి రష్మికను కూడా ట్యాగ్‌ చేశారు. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఆ చిన్నారి డ్యాన్స్ చూసిన రష్మిక కూడా ఫిదా అయిపోయింది. ఆ వీడియో ఉన్న ట్వీట్ ట్యాగ్ చేసి ‘మేడ్ మై డే… ఈ క్యూట్ బేబీని ఎలాగైనా కలవాలి. ఎలాగో కొంచెం చెప్తారా?’ అంటూ కామెంట్‌ పెట్టింది. అయితే ఈ క్యూట్ కిడ్‌ నేపాల్‌కి చెందినదని కామెంట్ల ద్వారా తెలుస్తోంది. . ఇక ఆ అమ్మాయిని మీరు కలవాలంటే నేపాల్ వెళ్ళండి అంటూ ఒకరు కామెంట్ చేశారు. కాగా నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. పాప ట్యాలెంట్‌ను ప్రశంసిస్తూ వేలాది మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ పాప డ్యాన్స్‌ వీడియోను చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu