Krishnamraju Demise: కృష్ణంరాజు మృతిపై లారెన్స్‌ ఎమోషనల్‌.. చివరి చూపునకూ నోచుకోలేకపోయానంటూ..

Raghava Lawrence: ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్‌ కృష్ణంరాజు (Krishnam Raju) అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం సినీ, రాజకీల ప్రముఖుల సమక్షంలో ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Krishnamraju Demise: కృష్ణంరాజు మృతిపై లారెన్స్‌ ఎమోషనల్‌.. చివరి చూపునకూ నోచుకోలేకపోయానంటూ..
Krishnamraju
Follow us
Basha Shek

|

Updated on: Sep 13, 2022 | 4:44 PM

Raghava Lawrence: ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్‌ కృష్ణంరాజు (Krishnam Raju) అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం సినీ, రాజకీల ప్రముఖుల సమక్షంలో ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే కృష్ణంరాజు మరణవార్తను టాలీవుడ్‌ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఆయనతో కలిసి పనిచేసిన నటీనటులు, సాంతిక నిపుణులు తమ అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తాజాగా కృష్ణంరాజు, ప్రభాస్‌తో కలిసి రెబల్‌ (Rebel) సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవా లారెన్స్ ఆయ‌న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా రెబ‌ల్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో కృష్ణంరాజు ఇచ్చిన ఆతిథ్యాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్‌ అయ్యాడు లారెన్స్‌. కృష్ణంరాజు, ప్రభాస్‌తో కలిసున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఆయన.. ‘రెబ‌ల్‌ స్టార్ కృష్ణంరాజు గారిని మిస్‌ అవుతున్నాను. ఆయ‌న ప్రతి ఒక్కరినీ సొంత బిడ్డలా చూసుకుంటారు.. అంద‌రికీ ఆయ‌న ఓ అమ్మలా ఆహారం వ‌డ్డిస్తుంటారు. కృష్ణంరాజు ప్రేమ, కేరింగ్‌ను బాగా మిస్ అవుతున్నా. నేను టౌన్‌లో లేక‌పోవ‌డం వ‌ల్ల ఆయ‌నకు వీడ్కోలు ప‌లక‌లేక‌పోయాను. అది నా దుర‌దృష్టం. ఆయ‌న వార‌స‌త్వం ప్రభాస్‌ ద్వారా ఎల్లప్పుడూ కొన‌సాగుతుంది’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చాడు రాఘవ.

కాగా వీరి కాంబినేషన్‌లో వచ్చిన రెబల్‌ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్‌కు మంచి పేరొచ్చింది. కాగా గతేదాది కాంచన రీమేక్‌ ‘లక్ష్మీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు లారెన్స్‌. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ఈ చిత్రం మిక్స్‌ డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పి. వాసు దర్శకత్వంలో ‘చంద్రముఖి 2’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల  కోసం క్లిక్ చేయండి..

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?