AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంత కర్కశమా? రోడ్డుపైనే కుక్క పిల్లను నేలకేసి కొట్టిన మహిళ.. మెడకు బిగించిన తాడు పట్టుకుని మరీ..

Agra: కుక్కలు ఎంతో విశ్వాసమైనవి. మనుషుల పట్ల అవి ఎంతో ప్రేమగా, దయగా నడుచుకుంటాయి. అందుకే చాలామంది వీటిని ఇళ్లల్లో పెంచుకుంటారు. కుటుంబ సభ్యులతో సమానంగా అల్లారుముద్దుగా చూసుకుంటారు. అలాంటి పెంపుడు కుక్కల పట్ల ఓ మహిళ కర్కశంగా వ్యవహరించింది.

Viral Video: ఇంత కర్కశమా? రోడ్డుపైనే కుక్క పిల్లను నేలకేసి కొట్టిన మహిళ.. మెడకు బిగించిన తాడు పట్టుకుని మరీ..
Woman Beats Up Dog
Basha Shek
|

Updated on: Sep 12, 2022 | 7:10 PM

Share

Agra: కుక్కలు ఎంతో విశ్వాసమైనవి. మనుషుల పట్ల అవి ఎంతో ప్రేమగా, దయగా నడుచుకుంటాయి. అందుకే చాలామంది వీటిని ఇళ్లల్లో పెంచుకుంటారు. కుటుంబ సభ్యులతో సమానంగా అల్లారుముద్దుగా చూసుకుంటారు. అలాంటి పెంపుడు కుక్కల పట్ల ఓ మహిళ కర్కశంగా వ్యవహరించింది. కుక్క పిల్లను రోడ్డు మీద అందరూ చూస్తుండగానే చావగొట్టింది. మెడకు తగిలించిన తాడు పట్టుకుని ఆ మూగజీవాన్ని రోడ్డుకేసి బాదింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ దారుణ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన జంతుప్రేమికులు, నెటిజన్లు సదరు మహిళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాల పట్ల ఇంత కర్కశత్వమా? అంటూ మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు.

వైరలవుతోన్న ఈ వీడియోలో ఓ మహిళ రోడ్డుపై నడుస్తూనే తనతో తీసుకొచ్చిన కుక్కపిల్లను చావబాదింది. చుట్టుపక్కల జనాలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అయితే ఆమె ప్రవర్తన మరీ శ్రుతిమించడంతో కొందరు వచ్చి ఆమెను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో ఈ విషయం పోలీసుల దాకా చేరింది. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామని సదరు మహిళపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..