Krishnam Raju: పేరులో రెబల్‌.. అయినా ఆయన మనసు మాత్రం వెన్న.. పనిమనిషిని కూడా ఫ్యామిలీ మెంబర్‌లా..

Krishnam Raju Demise: కృష్ణంరాజు.. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. కెరీర్‌ ప్రారంభంలో హీరోగా, విలన్‌గా మెప్పించిన ఆయన ఆతర్వాత సపోర్టింగ్‌ రోల్స్‌తో అదరగొట్టారు.

Krishnam Raju: పేరులో రెబల్‌.. అయినా ఆయన మనసు మాత్రం వెన్న.. పనిమనిషిని కూడా ఫ్యామిలీ మెంబర్‌లా..
Krishnam Raju
Follow us
Basha Shek

|

Updated on: Sep 11, 2022 | 11:57 AM

Krishnam Raju Demise: కృష్ణంరాజు.. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. కెరీర్‌ ప్రారంభంలో హీరోగా, విలన్‌గా మెప్పించిన ఆయన ఆతర్వాత సపోర్టింగ్‌ రోల్స్‌తో అదరగొట్టారు. భక్త కన్నప్ప, త్రిశూలం, పల్నాటి పౌరుషం, బొబ్బలి బ్రహ్మన్న తదితర సినిమాల్లో కృష్ణంరాజు  నటనను చూసి అభిమానులు రెబల్‌స్టార్‌ అని ముద్దు పేరు పెట్టుకున్నారు. వందలాది చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించిన ఈ సీనియర్‌ నటుడు తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేటి ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో టాలీవుడ్‌ విషాదంలో మునిగిపోయింది. సినిమా ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కృష్ణం రాజు మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

కాగా పేరులో రెబెల్‌ ఉన్నా కృష్ణం రాజు మనసు వెన్న అని ఆయన గురించి తెలిసిన వారెవరైనా చెబుతారు. కాగా గతేడాది కృష్ణంరాజు కుటుంబం తమ ఇంట్లో పనిచేస్తున్న పద్మను ఘనంగా సత్కరించింది. కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి గారైతే ఆమెకు ఓ బంగారు గొలుసును కూడా కానుకగా ఇచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పాతికేళ్లుగా తమ దగ్గరే పనిచేస్తున్న పనిమనిషిని కృష్ణంరాజు దంపతులు తమ సొంత ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకుంటారట. అందుకే ఆరోజు ఆమెను ఘనంగా సత్కరించి గోల్ట్‌ చైన్‌ గిఫ్ట్‌గా ఇచ్చారట. ఇక ఇండస్ట్రీలో ఉన్న పెద్దలంతా కృష్ణంరాజు తన ఇంట్లో చేసే అతిథి మర్యాదల గురించి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన సినీ వారసుడు ప్రభాస్ కూడా అదే అలవాటు చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే