Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnam raju death: కృష్ణంరాజు సినిమాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఇంటరెస్టింగ్ కామెంట్స్.. రెబల్ స్టార్ మృతికి సంతాపం తెలిపిన నరేంద్రమోదీ, అమిత్ షా

రెబల్ స్టార్ యువి.కృష్ణంరాజు మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన సేవలను ఈసందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రెబల్ స్టార్..

Krishnam raju death: కృష్ణంరాజు సినిమాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఇంటరెస్టింగ్ కామెంట్స్.. రెబల్ స్టార్ మృతికి సంతాపం తెలిపిన నరేంద్రమోదీ, అమిత్ షా
Modi, Amit Shah Condolence
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 11, 2022 | 11:28 AM

Krishnam raju death: రెబల్ స్టార్ యువి.కృష్ణంరాజు మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన సేవలను ఈసందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా వేర్వేరుగా ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృష్ణం రాజు సినిమాలపై కూడా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. కృష్ణంరాజు మృతి చెందడం ఎంతో బాధాకరమని.. ఆయన సినిమాలు రాబోయే తరానికి మార్గదర్శనం చేస్తాయన్నారు. కృష్ణం రాజు సినిమాల్లోని మాధుర్యం, సృజనాత్మకతను భవిష్యత్తు తరాలు అందిపుచ్చుంటాయని ట్వీట్ లో పేర్కొన్నారు. సామాజిక సేవలోనూ ముందుండే ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. కృష్ణంరాజుకుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కృష్ణంరాజు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెబల్ స్టార్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ తెలుగులో ట్వీట్ చేశారు అమిత్ షా. తెలుగు సినిమా దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.కృష్ణంరాజు మనల్ని విడిచిపెట్టారని తెలి‌సి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. కృష్ణంరాజు బహుముఖ నటనతో, సామాజిక సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారని అన్నారు. కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..