వామ్మో! ఏం గుండె ధైర్యం వీడిది.. అనకొండల మధ్య ఆ చదువేందిరా బాబు
పాము అంటేనే అమ్మో అనుకుంటూ ఆమడ దూరం పరుగెడతారు చాలామంది. అయితే.. ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నం. ఏ పామైనా అతడి ముందు తలవంచి క్రమశిక్షణతో మెలిగేలా చేసుకున్నాడతడు.
పాము అంటేనే అమ్మో అనుకుంటూ ఆమడ దూరం పరుగెడతారు చాలామంది. అయితే.. ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నం. ఏ పామైనా అతడి ముందు తలవంచి క్రమశిక్షణతో మెలిగేలా చేసుకున్నాడతడు. ఒకటి కాదు.. రెండు కాదు.. కుప్పలుగా ఉన్న కొండచిలువల మధ్య ఏం చేశాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న ఫోటో ప్రకారం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు భారీ సైజ్ కొండచిలువల మధ్య ఓ వ్యక్తి పుస్తకం పట్టుకుని చదువుకుంటూ కూర్చున్నాడు. ఇందుకు సంబంధించి చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూడగానే నెటిజన్లు ఒకింత షాక్ కావడమే కాదు.. అతడి గుండె ధైర్యానికి ఫిదా అవుతున్నారు కూడా. ఈ ఫోటోను జయ్ బ్రేవర్ అనే వ్యక్తి తీయగా.. అతడు దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Big News Big Debate: టార్గెట్ ఢిల్లీ.. తగ్గేదే లే..లైవ్ వీడియో