వీడు రూటే సపరేటు.. గల్లీ దుమ్మురేపుతున్న నామ్‌కిన్‌వాలా !!
మార్కెటింగ్ స్కిల్స్ ఉంటేఈ రోజుల్లో దేనైనా ఈజీ అమ్మగలం. ఖరీదైన వస్తువు అయితే దాని మార్కెటింగ్ కూడా ఖరీదుగానే ఉంటుంది. అయితే టాలెంట్ ఉండాలి గాని ఎడారిలోనూ ఇసుక అమ్మవచ్చని చాలా మంది నిరూపించాడు ఓ వ్యక్తి.
మార్కెటింగ్ స్కిల్స్ ఉంటేఈ రోజుల్లో దేనైనా ఈజీ అమ్మగలం. ఖరీదైన వస్తువు అయితే దాని మార్కెటింగ్ కూడా ఖరీదుగానే ఉంటుంది. అయితే టాలెంట్ ఉండాలి గాని ఎడారిలోనూ ఇసుక అమ్మవచ్చని చాలా మంది నిరూపించాడు ఓ వ్యక్తి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన నసీమ్ అహ్మద్.. ఒకప్పుడు మెకానిక్‌గా పనిచేశాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇప్పుడు ఇలా వ్యాపారం చేసుకుంటున్నాడు. మిక్సర్, బూందీ, సేవ్ వంటి నమ్కీన్స్‌కు మధ్యప్రదేశ్ చాలా ఫేమస్. రత్లామ్ సేవ్, ఇండోర్ నమ్కీన్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వాటిని ఇలా వీధుల వెంట తిరుగుతూ అమ్ముతుంటాడు నసీమ్. ఇళ్లలో ఉన్నవారు తమ దగ్గరికి వచ్చి కొనేందుకు పాటను ఎంచుకున్నారు నసీమ్. నా నా నా నా నమ్కీన్… తీ తీ తీ తీ తీస్ రూపయ్యా… అంటూ పాడుతూ కస్టమర్లనూ ఆకట్టుకున్నాడు. ఇంతకు ముందు కూడా ఈయన ఇలాగే స్కూటర్‌పై వీటిని పెట్టుకొని అమ్మేవాడు. కాని ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావడంతో ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బంది నుంచి వచ్చేదే ఈ సాంగ్ ఐడియా. సేల్స్ కోసం సొంతంగా పాట ఎంచుకున్నాడు. తన దగ్గర కొన్నా కొనకపోయినా చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి తనను చూస్తున్నారని నసీమ్ మురిసి పోతుంటాడు. ఈ మధ్యే ఒక యువకుడు నసీమ్ అహ్మద్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో తర్వాత సేల్స్ పెరిగాయో లేదా తెలియదు కాని నసీమ్ మాత్రం చాలా పాపులర్ అయ్యాడు. ఢిల్లీ, ముంబయి నుంచి కూడా తనకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారని సంబరపడుతున్నాడు నసీమ్
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడు రూటే సపరేటు.. గల్లీ దుమ్మురేపుతున్న నామ్‌కిన్‌వాలా !!
వామ్మో! ఏం గుండె ధైర్యం వీడిది.. అనకొండల మధ్య ఆ చదువేందిరా బాబు
Big News Big Debate: టార్గెట్ ఢిల్లీ.. తగ్గేదే లే..లైవ్ వీడియో