Viral Video: మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌.. చెప్పులతో పొట్టుపొట్టుగా కొట్టుకున్న అంకుల్స్‌.. కారణమేంటంటే?

Shocking Video: ఈరోజుల్లో గొడవలు సర్వసాధారణమైపోయాయి. చిన్న చిన్న విషయానికి ప్రజలు ఘర్షణ పడుతున్నారు. కొన్ని సార్లు ఈ గొడవలు తీవ్ర రూపం దాల్చుతుంటాయి. తలలు కూడా పగులగొట్టుకునేంత తీవ్రంగా మారిపోతుంటాయి.

Viral Video: మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌.. చెప్పులతో పొట్టుపొట్టుగా కొట్టుకున్న అంకుల్స్‌.. కారణమేంటంటే?
Mens Fight
Follow us
Basha Shek

|

Updated on: Sep 12, 2022 | 7:34 PM

Shocking Video: ఈరోజుల్లో గొడవలు సర్వసాధారణమైపోయాయి. చిన్న చిన్న విషయానికి ప్రజలు ఘర్షణ పడుతున్నారు. కొన్ని సార్లు ఈ గొడవలు తీవ్ర రూపం దాల్చుతుంటాయి. తలలు కూడా పగులగొట్టుకునేంత తీవ్రంగా మారిపోతుంటాయి. దీంతో కొందరు ప్రాణాపాయ స్థితికి గురై ఆసుపత్రులలో కూడా చేరవల్సి వస్తోంది. సోషల్‌ మీడియాలో కూడా మనుషుల మధ్య గొడవలకు సంబంధించిన వీడియోలు బాగానే కనిపిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకోవడం మనం చూడవచ్చు. ఇందులో ఒకరు వృద్ధుడిలా కనిపిస్తుంటే మరొకరు 40-45 వయసున్న వారిలా ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందో, ఎందుకు తలెత్తిందో తెలియదు కానీ ఆజన్మ శత్రువల కంటే దారుణంగా తగువులాడుతుకున్నారు. ముందుగా ముసలాయన చెప్పు తీసి కొట్టేందుకు ప్రయత్నించగా.. తానేం తక్కువ తినలేదంటూ మరో వ్యక్తి సైతం షూస్‌ విప్పి దాడి చేస్తాడు. ఒకరి కాలర్‌ మరొకరు పట్టుకుని చెప్పులు, షూలతో ముఖాలు వాయించుకుంటారు. వీరి తగువు తీవ్రరూపం దాల్చడంతో మూడో వ్యక్తి వచ్చి అక్కడికి వచ్చి వారిని అడ్డుకుంటాడు. దీంతో ఇద్దరూ తగ్గుతారు.

ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అయితే వీడియోలో గోడపై ఉన్న నోటీసు బోర్డు ఇది ఖచ్చితంగా ఓ ప్రభుత్వ కార్యాలయం దగ్గర జరిగిందని అంచనా వేయచ్చు. @Tam_Khan అనే IDతో ట్విట్టర్‌లో ఈ ఫన్నీ ఫైట్‌ వీడియోను షేర్‌ చేశారు. కేవలం 36 సెకన్ల ఉన్న ఈ వీడియో నెటిజన్లకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘తుపాకులు, AK47, అటామ్ బాంబ్, ఎయిర్‌బాంబింగ్ మొదలైన వాటి కంటే వీరి ఆయుధాలే ప్రమాదకరమైనవి. ప్రపంచ దేశాలన్నీ వీరిని చూసి నేర్చుకోవాలి’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..