T20 World Cup: తండ్రి స్ఫూర్తితో క్రికెట్ ఓనమాలు.. సైకిల్‌పై అకాడమీకి.. కట్‌ చేస్తే టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్

Arshdeep Singh: అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. ఈ టీంలో చాలామంది యువ క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. అయితే ఆరునెలల క్రితం వరకు టీం ఇండియాలో..

T20 World Cup: తండ్రి స్ఫూర్తితో క్రికెట్ ఓనమాలు.. సైకిల్‌పై అకాడమీకి.. కట్‌ చేస్తే టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్
Indian Cricket Team
Follow us

|

Updated on: Sep 12, 2022 | 9:42 PM

Arshdeep Singh: అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. ఈ టీంలో చాలామంది యువ క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. అయితే ఆరునెలల క్రితం వరకు టీం ఇండియాలో అసలు పేరు వినపడని ఓ ఆటగాడు పొట్టి ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా ఫ్లైట్‌ ఎక్కనున్నాడు. అతనే పంజాబ్‌ స్వింగ్‌ బౌలర్‌ అర్ష్‌దీప్ సింగ్. చిన్నప్పుడు తండ్రి దర్శన్‌ సింగ్‌ స్ఫూర్తితో క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్న అతను ఇప్పుడు ఏకంగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే స్థాయికి చేరుకున్నాడు. ఒకసారి సరదాగా అర్ష్‌దీప్‌ ఇన్‌స్వింగర్‌ విసరడం చూసిన అతని తండ్రి కుమారుడిని చండీగఢ్‌లోని జస్వంత్ రాయ్ అకాడమీలో చేరిపించాడు. అయితే ఈ అకాడమీ ఇంటికి దూరంగా ఉండేది. దీంతో రోజూ సైకిల్‌పైనే క్రికెట్‌ అకాడమీకి వెళ్లేవాడు అర్ష్‌దీప్.

కాగా ఒకసారి అర్ష్‌దీప్‌ సైకిల్‌ పంక్చర్‌ కావడంతో కాలినడకన అకాడమీకి వెళ్లాల్సి వచ్చింది. అయితే అప్పటికే ప్రాక్టీస్‌కు చాలా ఆలస్యమైంది. దీంతో కోచ్‌ అతనికి పనిష్మెంట్ ఇచ్చాడు. ‘ఆరోజు చాలా వేడిగా ఉంది. అర్ష్‌దీప్‌ ఆలస్యంగా ప్రాక్టీస్‌ వచ్చాడు. దీంతో నేను అతనికి పనిష్మెంట్‌ ఇచ్చాను. ప్రాక్టీస్‌ అయ్యాక పార్కింగ్ లో సైకిల్ లేకపోవడం గమనించాను. దీనిపై నేను అతనిని అడగ్గా.. అసలు విషయం చెప్పేశాడు. ఆరోజే అర్ష్‌దీప్‌ నాతో అన్నాడు.. టీమిండియాకు ఆడడమే తన ఏకైక లక్ష్యమని’ అని అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు కోచ్‌. కాగా ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చాడు అర్ష్‌దీప్. ముఖ్యంగా ఐపీఎల్‌-2022 లో పదునైన యార్కర్లు విసురుతూ బ్యాటర్ల భరతం పట్టాడు. ఈ ప్రతిభ ఆధారంగానే టీమ్ ఇండియాలో చోటు సంపాదించాడు . జులైలో ఇంగ్లండ్ టూర్లో టీ20 సిరీస్ కోసం టీమ్ ఇండియాను ప్రకటించిన చోట్టులో సంపాదించాడు. ఆతర్వాత అతని ప్రయాణం ఆగలేదు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడం అర్ష్‌దీప్‌ ప్రత్యేకత. భారత్ తరఫున ఇప్పటి వరకు 11 టీ20 మ్యాచ్‌లు ఆడిన పంజాబీ సీమర్‌ మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో అతనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Latest Articles
మ్యూచువల్ ఫండ్ కేవైసీ అప్‌డేట్ చేయండి.. ఎలా చేయాలో తెలుసుకోండి
మ్యూచువల్ ఫండ్ కేవైసీ అప్‌డేట్ చేయండి.. ఎలా చేయాలో తెలుసుకోండి
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్‌ ప్యాక్‌..!
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్‌ ప్యాక్‌..!
సమ్మర్‌లో చేసే ఈ తప్పులు.. జీర్ణ సమస్యలకు కారణమవుతాయి
సమ్మర్‌లో చేసే ఈ తప్పులు.. జీర్ణ సమస్యలకు కారణమవుతాయి
అవసరానికి మించి అధికంగా నీళ్లు తాగడం అంత ప్రమాదమా..!
అవసరానికి మించి అధికంగా నీళ్లు తాగడం అంత ప్రమాదమా..!
మతిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లో రియల్ మీ నయా ఫోన్ రిలీజ్
మతిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లో రియల్ మీ నయా ఫోన్ రిలీజ్
కొత్తింట్లోకి శోభాశెట్టి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి.. వీడియో
కొత్తింట్లోకి శోభాశెట్టి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి.. వీడియో
ఏడాదిలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే లాభమా? నష్టమా?
ఏడాదిలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే లాభమా? నష్టమా?
ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ డాన్స్
ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ డాన్స్
బలమైన జట్టుతో బరిలోకి టీమిండియా.. పూర్తి విశ్లేషణ
బలమైన జట్టుతో బరిలోకి టీమిండియా.. పూర్తి విశ్లేషణ
దంచికొడుతున్న ఎండలు.. ఎండల్లో కార్లల్లో ఆ జాగ్రత్తలు తప్పనిసరి
దంచికొడుతున్న ఎండలు.. ఎండల్లో కార్లల్లో ఆ జాగ్రత్తలు తప్పనిసరి