ICC Award: టీమిండియాపై సెంచరీతో కదం తొక్కాడు.. ఐసీసీ అవార్డుతో సత్కరించింది.. రికార్డు బ్రేక్!

ICC Player Of The Month Award: జింబాబ్వే స్టార్‌ ఆల్‌రౌండర్‌ సికిందర్‌ రజా (Sikandar Raza) అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును దక్కించుకుని, ఈ ఘనత సాధించిన తొలి జింబాబ్వే క్రికెటర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు.

ICC Award: టీమిండియాపై సెంచరీతో కదం తొక్కాడు.. ఐసీసీ అవార్డుతో సత్కరించింది.. రికార్డు బ్రేక్!
Sikindar Raza
Follow us
Basha Shek

|

Updated on: Sep 12, 2022 | 8:02 PM

ICC Player Of The Month Award: జింబాబ్వే స్టార్‌ ఆల్‌రౌండర్‌ సికిందర్‌ రజా (Sikandar Raza) అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును దక్కించుకుని, ఈ ఘనత సాధించిన తొలి జింబాబ్వే క్రికెటర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఈసారి అవార్డు కోసం రజాతో పాటు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌, న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ శాంట్నర్‌లు పోటీపడ్డారు. అయితే ప్రత్యర్థితో సంబంధం లేకుండా పరుగుల వర్షం కురిపిస్తోన్న సికిందర్‌నే ఈ అవార్డు వరించింది. ఆగస్టులనెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) ప్రకటించింది. పురుషుల విభాగంలో రజాకు.. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మెక్‌గ్రాత్‌కు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. గత కొన్ని నెలలుగా ఆల్‌రౌండ్ ఫెర్మామెన్స్‌తో అదరగొడుతున్నాడు సికిందర్‌. స్వదేశంలో బంగ్లాదేశ్‌, భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీల మోత మోగించాడు. బంగ్లాదేశ్‌పై రెండు సెంచరీలు చేయగా.. పటిష్ఠమైన భారత బౌలర్లను చీల్చిచెండాడుతూ మరో శతకాన్ని నమోదు చేశాడు. బౌలింగ్‌లోనూ సత్తాచాటిన సికిందర్‌ బంగ్లాతో వన్డే సిరీస్‌ను క్వీన్‌ స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. గత నెలలో అతను మొత్తం ఓవరాల్‌గా రజా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఈ ఆటతీరుకు నిదర్శనంగానే ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ పురస్కారం ఇచ్చి రజాను సత్కరించింది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..