Sanjay Dutt: ఆ స్టార్ హీరో కోసం విలన్‌గా మారనున్న సంజయ్ దత్.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే
ఒకప్పుడు స్టార్ హీరోలుగా రాణించినవారంతా ఇప్పుడు విలన్ వేషాలు వేస్తున్నారు. హీరోగా వచ్చిన క్రేజ్ కంటే విలన్ గా చేస్తే వచ్చే క్రేజే ఎక్కువ అవుతోంది.
ఒకప్పుడు స్టార్ హీరోలుగా రాణించినవారంతా ఇప్పుడు విలన్ వేషాలు వేస్తున్నారు. హీరోగా వచ్చిన క్రేజ్ కంటే విలన్ గా చేస్తే వచ్చే క్రేజే ఎక్కువ అవుతోంది. దాంతో చాలా మంది సీనియర్ హీరోలు ఇప్పుడు విలన్ గా మరి అదరగొడుతున్నారు. మనదగ్గర చెప్పుకోవాలంటే బెస్ట్ ఉదాహరణ జగపతి బాబే.. అలాగే బాలివుడ్ లో చెప్పాలంటే సంజయ్ దత్ పేరు చెప్పాల్సిందే. ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన సంజయ్.. ఇప్పుడు విలన్ గా మరి భయపెడుతున్నాడు. తనదైన నటనతో డైలాగ్ డెలివరీతో సంజయ్(Sanjay Dutt)ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవలే పాన్ ఇండియా మువీ కేజీఎఫ్2 సినిమాలో అధీరాగా అదరగొట్టాడు సంజయ్ దత్. యశ్ ను ఢీ కొట్టే పర్ఫెక్ట్ విలన్ గా నటించి మెప్పించాడు సంజయ్.ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోలు విలన్ గా నటించనున్నారట సంజయ్.
దళపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటటైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వంశీ. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీకి వారసుడు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దళపతి లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. విక్రమ్ తో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లోకేష్. దళపతితో నెక్స్ట్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడట. అలాగే ఈ సినిమా విజయ్ ను ఢీ కొట్టేందుకు సంజయ్ దత్ ను రంగంలోకి దింపుతున్నాడట లోకేష్. ఈ రోల్ కోసం సంజయ్ దత్ భారీగానే ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 10 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు టాక్. మరి ఈ వార్తల్లో వ్ వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.