Allu Arjun: ప్రపంచాన్ని మరిచి.. సంగీతంలో మునిగి.. పార్టీలో ‘ఊ అంటావా’ పాటకు బన్నీ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూశారా ?..

Siima Awards 2022: దీంతో పుష్ప చిత్రయూనిట్ ఫుల్ హ్యాప్పీగా ఉంది. సైమా అవార్డ్స్ వేడుకల అనంతరం పుష్ప టీం పార్టీ జరపుకున్నట్లుగా తెలుస్తోంది.

Allu Arjun: ప్రపంచాన్ని మరిచి.. సంగీతంలో మునిగి.. పార్టీలో 'ఊ అంటావా' పాటకు బన్నీ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూశారా ?..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2022 | 1:47 PM

Siima Awards 2022: డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఇక తాజాగా సైమా అవార్డ్స్ 2022లో కూడా సత్తా చాటింది. ఏకంగా 12 విభాగాల్లో నామినేట్ అయ్యి..అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు.. ఉత్తమ నటుడు.. ఉత్తమ సహాయ నటుడు.. ఉత్తమ సంగీత దర్శకుడు.. ఉత్తమ సాహిత్య రచయిత ఇలా మొత్తం ఆరు కేటగిరీల్లో అవార్లు అందుకుంది. దీంతో పుష్ప చిత్రయూనిట్ ఫుల్ హ్యాప్పీగా ఉంది. సైమా అవార్డ్స్ వేడుకల అనంతరం పుష్ప టీం పార్టీ జరపుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ పార్టీకి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో బన్నీ ఫుల్ జోష్‍లో కనిపిస్తున్నాడు. ఊ అంటావా మావ పాటకు.. ప్రపంచాన్ని మరిచి.. సంగీతంలో మునిగిపోయి చిల్ అవుతున్నాడు. డీజే పక్కనే నిల్చోని డ్యాన్స్ చేస్తూ సంతోషంలో ఉన్నాడు. ఎవ్వరైనా ఊ అనాల్సిందే.. తగ్గేదే లే అంటూ తనదైన స్టైల్లో డైలాగ్ చెబుతూ కనిపించాడు బన్నీ. మొత్తానికి ఏడాది సైమా అవార్డులలో పుష్ప సినిమాకు అవార్డుల పంట పండింది. ఈ సినిమాలో రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సిక్వెల్ పుష్ప 2 తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.