Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‏కు బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి నోటీసులు పంపిన పోలీసులు..

మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ పై ప్రస్తుతం 10కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ క్రిమినల్ కేసుల్లో సుకేష్ ప్రమేయం గురించి జాక్వెలిన్‏కు ముందుగానే తెలుసునని..

Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‏కు బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి నోటీసులు పంపిన పోలీసులు..
Jacqueline Fernandez
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2022 | 9:40 AM

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‏పై (Jacqueline Fernandez) విచారణ చేపట్టారు ఢిల్లీ పోలీసులు. రూ. 200 కోట్ల దోపిడీ, మనీలాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అతనితో హీరోయిన్ ప్రేమలో ఉందని.. అతడి నుంచి భారీ మొత్తంలో కానుకలు వచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటుంది జాక్వెలిన్. ఈ క్రమంలోనే సుకేష్ చంద్రశేఖర్ పై ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణకు సెప్టెంబర్ 14న హాజరు కావాలంటూ ఢిల్లీ పోలీసులు ఆమెకు నోటీసుపు జారీ చేశారు. వాస్తవానికి జాక్వెలిన్‏ను సెప్టెంబర్ 12న విచారించాల్సి ఉంది. కానీ ముందుస్తు కట్టుబాట్లతో మందిర్ మార్గ్‏లోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ హెడ్ క్వార్టర్స్‏కు తాను విచారణకు రాలేనని జాక్వెలిన్ కోరగా.. ఆమెకు సెప్టెంబర్ 14న హాజరుకావాలని సమన్లు జారీ చేశారు పోలీసులు.

ఇదిలా ఉంటే.. మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ పై ప్రస్తుతం 10కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ క్రిమినల్ కేసుల్లో సుకేష్ ప్రమేయం గురించి జాక్వెలిన్‏కు ముందుగానే తెలుసునని.. కానీ అవేం పట్టించుకోకుండా అతనితో ఆర్థిక లావాదేవిల్లో పాల్గోన్నదని ఈడీ ధాఖలు చేసిన ఛార్జిషీట్‏లో పేర్కొంది. 2021 ఆగస్టు 30, అక్టోబరు 20న ఫెర్నాండెజ్ స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేశామని, అక్కడ చంద్రశేఖర్ నుండి బహుమతులు అందుకున్నట్లు ఆమె అంగీకరించిందని ఈడీ గతంలో పేర్కొంది. అంతేకాకుండా ఈ ఆదాయాన్ని ఇండియాతోపాటు విదేశాల్లోనూ తనకు తన కుటుంబసభ్యుల కోసం ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల