SIIMA 2022: దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి చెందిన సినిమాలు, నటీనటులు , సాంకేతిక నిపుణులు ప్రతిభకు గుర్తింపుగా ఏటా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) అవార్డులు ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఈ ఏడాది కూడా బెంగళూరు వేదికగా సైమా 2022 అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
SIIMA 2022: దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి చెందిన సినిమాలు, నటీనటులు , సాంకేతిక నిపుణులు ప్రతిభకు గుర్తింపుగా ఏటా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) అవార్డులు ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఈ ఏడాది కూడా కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా సైమా 2022 అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి వేడుకల్లో కమల్ హాసన్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, యశ్, రణ్‌వీర్ సింగ్, పూజాహెగ్డే, మంచు లక్ష్మీ, సుధీర్ బాబు, డింపుల్ హయాతి, ఈషా రెబ్బా, చాందిని చౌదరి, షాలినీ పాండే తదితర సెలబ్రిటీలు తళుక్కుమన్నారు. ఇక ఈ వేడుకల్లో రణ్‌వీర్ సింగ్ ‘మోస్ట్ పాపులర్ హిందీ యాక్టర్ ఇన్ సౌత్ ఇండియా’ విభాగంలో పురస్కారం అందుకున్నాడు. అనంతరం సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకుని మురిసిపోయాడు. దీంతో పాటు సైమా వేడుకల్లో వివిధ సౌతిండియన్ స్టార్స్‌తో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నాడు. అంతేకాదు వాటికి డిఫరెంట్ క్యాప్షన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
ఈ ఫొటోల్లో ముందుగా రానాతో కలిసి నవ్వుతూ కనిపించారు రణ్‌వీర్. దీనికి గుడ్‌టైమ్స్ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఆర్వాత విజయ్ దేవరకొండతో డ్యాన్స్ చేస్తూ రౌడీ బాయ్స్ అని, బన్నీని హత్తుకుని లవ్ సింబల్, యశ్‌తో కలిసి నడుస్తూ భాయ్ అని, కమల్ హాసన్ పక్కన కూర్చొని ది ఐకాన్ అంటూ రాసుకొచ్చాడు. క బుట్టబొమ్మ పూజ పిక్స్‌కు పగలబడే స్మైలీ ఎమోజీలను జత చేశాడు. ఈ ఫొటోలను చూసి సినిమా ఫ్యాన్స్ రణ్‌వీర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ అందరితో చాలా సరదాగా ఉంటాడని, అతనికి ఎలాంటి భేషజాలు లేవని కామెంట్లు పెడుతున్నారు.