Bigg Boss 6 Telugu: గీతూ గలాట వర్సెస్ సింగర్ రేవంత్.. నీతో మాట్లాడమే అశుద్ధమంటూ..

అలాగే ఫైమాను వాసంతి నామినేట్ చేయగా.. షానీని అభినయ, శ్రీ సత్య నామినేట్ చేశారు. దీంతో తనను నామినేట్ చేసిన అభినయను నామినేట్ చేశాడు షానీ.

Bigg Boss 6 Telugu: గీతూ గలాట వర్సెస్ సింగర్ రేవంత్.. నీతో మాట్లాడమే అశుద్ధమంటూ..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2022 | 10:10 AM

బిగ్‏బాస్ (Bigg Boss 6 Telugu) ఇంట్లో రెండోవారం నామినేషన్స్ రచ్చ ప్రారంభమైంది. తొలివారమే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈసారి మరింత హీట్ పెరిగింది. ఎవరికి వారు తగ్గేదే లే అన్నట్లుగా ప్రవర్తించారు. అయితే గతంలో మాదిరిగా కాకుండా.. ఈసారి కంటెస్టెంట్లకు షాకిచ్చాడు బిగ్ బాస్. ఒక్కో ఇంటి సభ్యుడు కేవలం ఒకరిని మాత్రమే నామినేట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అలా ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఒక్కొక్కరు ఒక్కో కంటెస్టెంట్‏ని మాత్రమే నామినేట్ చేయాలి. ముందుగా జంటగా వచ్చిన మెరినా, రోహిత్‏లను నామినేట్ చేశాడు ఆదిరెడ్డి. ఇక ఆ తర్వాత ఆదిరెడ్డికి హైట్ ఎక్కువగా ఉందంటూ ఇనయ నామినేట్ చేసింది. అలాగే ఫైమాను వాసంతి నామినేట్ చేయగా.. షానీని అభినయ, శ్రీ సత్య నామినేట్ చేశారు. దీంతో తనను నామినేట్ చేసిన అభినయను నామినేట్ చేశాడు షానీ.

ఆ తర్వాత గీతూ.. సింగర్ రేవంత్ మధ్య మాటల యుద్దం నడిచింది. అశుద్ధం మీద రాయి వేస్తే అది మన మీదే పడుతుంది అంటూ గీతూకు కౌంటర్ వేశాడు రేవంత్. జైల్లో ఉన్నప్పుడు నాకు నిద్రపట్టలేదని అంటే.. ఏ ఆదిరెడ్డి గారు నిద్ర పోనివ్వలేదా ? అని అన్నారు.. అది నాకు నచ్చలేదంటూ రేవంత్ పై ఫైర్ అయ్యింది గీతూ. దీంతో నేను అలా అన్నానా ? అని రేవంత్ సమర్ధించుకునే ప్రయత్నం చేయగా.. నీ ఉద్దేశ్యం అది కాకపోయినా.. అలాగే అన్నావ్ అంటూ గీతూకు మద్దతు తెలిపాడు ఆదిరెడ్డి. రేవంత్ వేసే జోక్స్ తనకు నచ్చడం లేదంటూ చెప్పుకొచ్చింది గీతూ. ఇక ఈ రెండోవారం నామినేషన్స్‏లో గీతూ, రేవంత్‏లకే ఎక్కువగా నామినేషన్స్ పడ్డాయి. గీతూను ఆరుగురు నామినేట్ చేయగా.. రేవంత్‏ను నలుగురు నామినేట్ చేశారు. ఇక రెండోవారం మెరీనా రోహిత్, ఫైమా, రాజ్, షానీ, అభినయ, ఆదిరెడ్డి, గీతూ, రేవంత్ నామినేట్ అయ్యారు.

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..