Viral Photo: ఈ బుజ్జాయి దక్షిణాదిలో టాలెంటెడ్ హీరోయిన్.. గ్లామర్ పాత్రలకు ఎప్పుడూ దూరమే..
కేవలం తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ఈ అమ్మాయి సినిమాలు చేస్తుంది. అంతేకాదు ఆమె తండ్రి ఒకప్పటి హీరో.. అలాగే ఆమె మేనత్త కూడా మంచి నటి. గుర్తుపట్టండి.
సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ తెగ వైరల్ అవుతుంటాయి. అందులో సినీతారలకు సంబంధించిన ఫోటోస్ ఇంకా ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం అన్ని భాషలకు చెందిన తారల చిన్ననాటి జ్ఞాపకాలు నెట్టింట అనేకం. తాజాగా మరో క్రేజీ హీరోయిన్ బాల్యం ఫోటో వైరల్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా. ఆ బుజ్జాయి దక్షిణాదిలోనే మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్.. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఎవరో గుర్తుపట్టండి. కేవలం తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ఈ అమ్మాయి సినిమాలు చేస్తుంది. అంతేకాదు ఆమె తండ్రి ఒకప్పటి హీరో.. అలాగే ఆమె మేనత్త కూడా మంచి నటి. గుర్తుపట్టండి.
ఆ క్యూట్ లిటిల్ చిన్నారి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. టక్ జగదీష్, వరల్డ్ ఫేమస్ లవర్, భూమిక, రిపబ్లిక్, నవాబ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె తండ్రి రాజేష్ కూడా మంచి నటుడే. 80లలో హీరోగా, సెకండ్ హీరోగా, సహయ నటుడిగా నటించి మెప్పించారు. అయితే ఐశ్వర్య ఎనిదేళ్లు ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సోదరులను కోల్పోయింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన ఐశ్వర్య ప్రస్తుతం హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.