Amala Paul: ఆ కారణంగానే మణిరత్నం సినిమాను రిజెక్ట్ చేసిన అమలాపాల్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..

అయితే పిలిచి మరీ ఆఫర్ ఇస్తే ఏకంగా మణిరత్నం సినిమానే రిజెక్ట్ చేసింది హీరోయిన్ అమలాపాల్. అయితే తాను ఎందుకు ఈ మూవీకి నో చెప్పాల్సి వచ్చిందనే విషయాన్ని ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది

Amala Paul: ఆ కారణంగానే మణిరత్నం సినిమాను రిజెక్ట్ చేసిన అమలాపాల్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..
Amala Paul
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2022 | 8:21 AM

సక్సెస్‏ఫుల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan ). ఈ సినిమాలో విక్రమ్ చియాన్, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తీ వంటి స్టార్స్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో చిన్న అతిథి పాత్ర అయిన చేయాలని ఉందంటూ రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ మనసులోని మాటలను చెప్పేశారు. ఒక పాత్ర చేస్తానంటే డైరెక్టర్ వద్దన్నారని రజినీ తెలిపారు. అయితే పిలిచి మరీ ఆఫర్ ఇస్తే ఏకంగా మణిరత్నం సినిమానే రిజెక్ట్ చేసింది హీరోయిన్ అమలాపాల్. అయితే తాను ఎందుకు ఈ మూవీకి నో చెప్పాల్సి వచ్చిందనే విషయాన్ని ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అమలాపాల్ (Amala Paul). మొదట్లో ఈ సినిమాకు కోసం ఆడిషన్స్‏కు వెళ్లానని.. కానీ ఆ చిత్రంలోని ఓ పాత్రకు తాను సెట్ కాలేదని.. ఇక గతేడాది మళ్లీ డైరెక్టర్ కాల్ చేసినప్పుడు తానే ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం తన మానసిక పరిస్థితి బాలేదని.. అందుకే ఈ సినిమాలో భాగమయ్యేందుకు సిద్ధంగా లేనని చెప్పేసిందట.

అమలాపాల్ మాట్లాడుతూ.. “నేను మణిరత్నం సర్ వీరాభిమానిని. ఈ సినిమా ఆడిషన్ కోసం మణిసర్ నన్ను పిలిచారు. దీంతో నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ మొదటిసారి సెలక్ట్ కాలేదు. దీంతో చాలా నిరాశకు గురయ్యాను. ఆ తర్వాత 2021లో అదే ప్రాజెక్ట్ కోసం నన్ను మళ్లీ పిలిచారు. కానీ ఆ సమయంలో నేను సినిమా చేసేంత మానసిక స్థితిలో లేను. దీంతో ఆ మూవీకి నో చెప్పాను. సినిమాను రిజెక్ట్ చేసినందుకు నేను చింతించడం లేదు. ఎందుకంటే కొన్ని విషయాలు పరిపూర్ణంగా జరుగుతాయి. మనం ఎలా చూస్తామో.. దాని గురించి మాత్రమే నేను భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. పీరియాడికల్ డ్రామా కల్కి కృష్ణమూర్తి ప్రసిద్ధ చారిత్రక నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.