Shakini Dhakini Trailer Talk: ఆకట్టుకుంటున్న శాకినీ ఢాకిని ట్రైలర్.. యాక్షన్.. థ్రిల్లింగ్ అంశాలతో అదిరిపోయిందిగా..

యాక్షన్.. థ్రిల్లింగ్ అంశాలతో ఆద్యంత ఆసక్తిగా కొనసాగుతుంది ఈ ట్రైలర్. పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న శాలిని.. దామిని అనే ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసుల కథే ఈ శాకిని ఢాకిని.

Shakini Dhakini Trailer Talk: ఆకట్టుకుంటున్న శాకినీ ఢాకిని ట్రైలర్.. యాక్షన్.. థ్రిల్లింగ్ అంశాలతో అదిరిపోయిందిగా..
Shakini Dhakini
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2022 | 8:40 AM

డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో హీరోయిన్స్ నివేధా థామస్, రెజీనా కాసాండ్రా ప్రధానపాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శాకిని ఢాకిని (Shakini Dhakini Trailer ). కొరియన్ సూపర్ హిట్ మిడ్ నైట్ రన్నర్స్‏కు రీమేక్‎గా వస్తోన్న ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని కలిగించగా.. సోమవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. యాక్షన్.. థ్రిల్లింగ్ అంశాలతో ఆద్యంత ఆసక్తిగా కొనసాగుతుంది ఈ ట్రైలర్. పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న శాలిని.. దామిని అనే ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసుల కథే ఈ శాకిని ఢాకిని.

సంతాన సాఫల్య కేంద్రాల మాటున ఓ ముఠా చేసే క్రైమ్ నేపథ్యంలో ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ ముఠా బారిన చిక్కుకున్న ఆడపిల్లల్ని కాపాడటం కోసం శాలిని, దామిని ఏం చేశారన్నది మిగిలిన కథ. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్.. ఇంటెన్స్ యాక్షన్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తి క్రియేట్ చేయగా.. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు మెక్ క్లియరీ, నరేష్ కుమారన్ సంగీతం అందించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.