Mrunal Thakur: ‘పెళ్లి కాకపోయిన పర్వాలేదు.. పిల్లలను మాత్రం కనాలని ఉంది’.. ‘సీతారామం’ హీరోయిన్ కామెంట్స్..

తాజాగా పెళ్లి, పిల్లల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది మృణాల్. 30 ఏళ్ల వయసున్న స్త్రీలు డేటింగ్, ప్రేమ, పెళ్లి, పిల్లలు గురించి ఆసక్తిగా ఉండరు అనే అంశం పై స్పందించింది. 

Mrunal Thakur: 'పెళ్లి కాకపోయిన పర్వాలేదు.. పిల్లలను మాత్రం కనాలని ఉంది'.. 'సీతారామం' హీరోయిన్ కామెంట్స్..
Mrunal
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2022 | 1:46 PM

సీతామహాలక్ష్మీగా తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). అందం, అభినయంతో ఆడియన్స్ మదిని గెలుచుకుంది. డైరెక్టర్ హాను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో వెండితెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. మలయాళ హీలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ భారీగా వసూళ్లు రాబట్టింది. అందమైన ప్రేమకావ్యంగా రూపొందిన ఈ మూవీ అటూ ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ఈ సినిమా తర్వాత మృణాల్‏కు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా పెళ్లి, పిల్లల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది మృణాల్. 30 ఏళ్ల వయసున్న స్త్రీలు డేటింగ్, ప్రేమ, పెళ్లి, పిల్లలు గురించి ఆసక్తిగా ఉండరు అనే అంశం పై స్పందించింది.

ఈ సమాజంలో మహిళల జీవితాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పెళ్లి, వయసు, సంతానం అంటూ అనేక ప్రశ్నలు వేస్తారు. తనను అర్థం చేసుకునే భాగస్వామి దొరకాలని కోరుకుంటున్నట్లు.. అలాగే తనకు పిల్లలు కూడా కావాలని తెలిపింది. మృణాల్ మాట్లాడుతూ.. నేను ఎక్కడి నుంచి వచ్చాను.. నా మనసులో ఏం జరుగుతుంది.. నా వృత్తి గురించి అర్థం చేసుకున్న భాగస్వామి ముఖ్యమని భావిస్తున్నాను. మన చుట్టూ చాలా అభద్రత ఉంది. ఒక సురక్షితమైన వ్యక్తి నాకు కావాలి. అలాంటి వాళ్లు దొరకడం చాలా అరుదు అని తెలిపింది. పెళ్లి కాకపోయిన పర్వాలేదు కానీ పిల్లలను కానాలని ఉంది. నాకు ప్రేమలో పడడం ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.