Ram Pothineni: మునుపెన్నడూ కనిపించని పాత్రలో రామ్.. బోయపాటి సినిమాలో ఇలా..

ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇచ్చిన హిట్ తప్పా ఇప్పటివరకు మరో హిట్ రుచిచూడాలకపోయాడు యంగ్ హీరో రామ్ పోతినేని. పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఆ సినిమాలో రామ్ మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.

Ram Pothineni: మునుపెన్నడూ కనిపించని పాత్రలో రామ్.. బోయపాటి సినిమాలో ఇలా..
Ram Pothineni
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 13, 2022 | 3:36 PM

ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇచ్చిన హిట్ తప్పా ఇప్పటివరకు మరో హిట్ రుచిచూడాలకపోయాడు యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni). పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఆ సినిమాలో రామ్ మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. తెలంగాణ యాసలో ఇరగదీశాడు రామ్. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత రామ్ మార్కెట్ మారిపోయింది. అయితే ఆ సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ మళ్లీ యధావిధిగా నిరాశపరచడం మొదలుపెట్టాయి. తిరుమల కిషోర్ తెరకెక్కించిన రెడ్, రీసెంట్ గా వచ్చిన వారియర్ సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా లింగు స్వామి దర్శకత్వంలో వచ్చిన వారియర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తాకొట్టింది. దాంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో ఆశలన్నీ బోయపాటి పైనే పెట్టుకున్నాడు.

రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు బోయపాటి. మాస్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన బోయపాటి.. ఇప్పుడు రామ్ కోసం అదే తరహా కథను రెడీ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీలో రామ్ ఎలా ఉండబోతున్నాడు.? బోయపాటి ఎలాంటి కథను సిద్ధం చేశాడు.? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రామ్ చాలా డిఫరెంట్ గా కనిపించున్నాడట. బోయపాటి ఈ సినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా గా రూపొందిస్తున్నారట. ఈ మూవీలో రామ్ రామ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. సినిమా చాలా వరకు కేరళ నేపథ్యంలో సాగుతుందని.. రామ్ ఒక అయ్యప్ప భక్తుడిగా నటిస్తారని టాక్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..