Srinidhi Shetty: అయోమయంలో అందాల భామ.. కేజీఎఫ్ బ్యూటీ షాకింగ్ నిర్ణయం తీసుకుందా..?
ఒకే ఒక్క సినిమా తో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవవడంతో రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసింది.
ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవవడంతో రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసింది. అమ్మడికి ఉన్న క్రేజ్ చూసి రెండో సినిమాకే అడిగినంత ఇచ్చారు నిర్మాతలు.. సీన్ కట్ చేస్తే ఆ సినిమా కాస్తా బోల్తాకొట్టింది. దాంతో ఇప్పుడు ఈ చిన్నదాని పరిస్థితి అయోమయంగా మారింది. ఇంతకు ఎవరు ఆ బ్యూటీ అనుకుంటున్నారా.. ఆ అమ్మడే శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty). ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రీ నిధి శెట్టి. తొలి సినిమానే పాన్ ఇండియా సినిమా అవ్వడం..అలాగే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో శ్రీనిధికి మంచి క్రేజ్ వచ్చింది.
తొలి సినిమాతోనే నటన, అందంతో కట్టిపడేసింది శ్రీనిధి. ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్ వచ్చింది. ఏకంగా తమిళ్ స్టార్ హీరో విక్రమ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. విక్రమ్ నటించిన కోబ్రా సినిమాలో హీరోయిన్ గా చేసింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు ఈ అమ్మడు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి అనే ఆలోచనలో పడింది. కోబ్రా సినిమా ఫ్లాప్ అవవడంతో శ్రీనిధి కి ఛాన్స్ లు ఇవ్వాలంటే నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అంత రెమ్యునరేషన్ ఇచ్చి ఈ చిన్నదాని హీరోయిన్ గా పెట్టుకోవడం అవసరమా అని అనుకుంటున్నారట. దాంతో శ్రీనిధి రెమ్యునరేషన్ తగ్గించాలని నిర్ణయించుకుందని టాక్ వినిపిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.