Allu Arjun: కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్ ఓ షార్ట్ ఫిల్మ్‏లో నటించాడని మీకు తెలుసా ?.. సుకుమార్ దర్శకత్వంలోనే..

అది కూడా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలోనే. ఐ యామ్ దట్ చేంజ్ అనే శీర్షికతో ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Allu Arjun: కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్ ఓ షార్ట్ ఫిల్మ్‏లో నటించాడని మీకు తెలుసా ?.. సుకుమార్ దర్శకత్వంలోనే..
Allu Arjun Sukumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2022 | 2:16 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప విజయాన్ని ఫుల్‏గా ఎంజాయ్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ సినిమా.. తాజాగా సైమా అవార్డ్ వేడుకలోనూ హవా కొనసాగించింది. ఏకంగా ఆరు అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాందిచుకున్నాడు బన్నీ. అయితే కెరీర్ ఆరంభం నుంచి తన నటనతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అయితే కెరీర్ ప్రారంభంలో బన్నీ ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించాడనే విషయం మీకు తెలుసా ?. అది కూడా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలోనే. ఐ యామ్ దట్ చేంజ్ అనే శీర్షికతో ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఎనిమిదేళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘ఐ యామ్ దట్ చేంజ్’ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మాతగా కూడా వర్క్ చేశాడు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో “మన కర్తవ్యాలు నిర్వర్తించడం కూడా దేశభక్తి. మార్పు మనతోనే మొదలవుతుంది. ఆ మార్పు నేనే. అలా మారండి” అని చెప్పారు. ఈ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంటే తనకు సరికొత్త గౌరవం వచ్చిందని బన్నీ అన్నారు. తాను ఎప్పుడూ సామాజిక అవగాహన ప్రకటనలను మంచి ఉద్దేశ్యంతో రూపొందించడం చూశాను. వారి ఉద్దేశ్యాలు గొప్పవి. కొన్నిసార్లు ఈ వాణిజ్య ప్రకటనలు అంత ప్రభావం చూపించవు. నా అభిమానులు, స్నేహితులు, విద్యార్థులు చాలా మంది తమదైన శైలిలో సమాజానికి సేవ చేస్తున్నారు. నేను కూడా ఈ సమాజానికి ఏదైనా చేయాలనుకున్నాను. అప్పుడే ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నాను అంటూ గతంలో అన్నారు బన్నీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.