AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sivakarthikeyan’s Prince: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘ప్రిన్స్’ మూవీ సాంగ్.. 100 మిలియన్ల వ్యూస్‌‌‌తో పాటు..

తమిళనాట మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో శివకార్తికేయన్ ఒకరు. ఈ టాలెంటెడ్ హీరో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

Sivakarthikeyan's Prince: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న 'ప్రిన్స్' మూవీ సాంగ్.. 100 మిలియన్ల వ్యూస్‌‌‌తో పాటు..
Prince
Rajeev Rayala
|

Updated on: Sep 15, 2022 | 7:18 PM

Share

తమిళనాట మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో శివకార్తికేయన్( Sivakarthikeyan) ఒకరు. ఈ టాలెంటెడ్ హీరో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. శివకార్తికేయన్ నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా రెమో, డాక్టర్ వరుణ్ సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు శివ కార్తికేయన్. ఈ మధ్య వచ్చిన డాన్ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు స్టైట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శివ. జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన అనుదీప్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు శివకార్తికేయన్. ఈ సినిమాకు ప్రిన్స్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు.  శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది.

ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన బింబిలికి పిలాపి  అనే పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తక్కువ టైం లోనే ఈ పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు, అదే సమయంలో 10 లక్షలకు పైగా లైక్‌లను కూడా సాధించింది. ఈ పాటను తమిళ్ లో అనిరుధ్ రవిచందర్ ఆలపించగా తెలుగులో రామ్ మిరియాల , రమ్య బెహరా ఆలపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌