Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmastra 2: బ్రహ్మాస్త్ర పార్ట్ 2‌ వర్క్ మొదలయ్యిందా..? సీక్వెల్‌లో లీడ్ రోల్ చేసేది ఎవరు?

కంటెంట్‌ కరెక్ట్‌గా ఉంటే ఆడియన్స్‌ ఏ సినిమానైనా ఆదరిస్తారని ప్రూవ్ చేసింది ఈ మూవీ. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సక్సెస్‌ బాలీవుడ్ లెక్కలు మార్చేస్తోంది.

Brahmastra 2: బ్రహ్మాస్త్ర పార్ట్ 2‌ వర్క్ మొదలయ్యిందా..?  సీక్వెల్‌లో లీడ్ రోల్ చేసేది ఎవరు?
Ranbir Kapoor in Brahmastra
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 15, 2022 | 1:39 PM

Brahmastra: Part 2: ఎట్టకేలకు బాలీవుడ్ మూవీ బిగ్ కలెక్షన్స్ రాబట్టింది. వరుస వివాదాలతో పాటు బాయ్‌కాట్ ట్రెండ్ భయపెట్టినా… బ్రహ్మస్త్ర బిగ్ హిట్‌గా నిలిచింది. కంటెంట్‌ కరెక్ట్‌గా ఉంటే ఆడియన్స్‌ ఏ సినిమానైనా ఆదరిస్తారని ప్రూవ్ చేసింది ఈ మూవీ. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సక్సెస్‌ బాలీవుడ్ లెక్కలు మార్చేస్తోంది. సెప్టెంబర్ 9న రిలీజైన ఈ మూవీ హిట్ కావటంతో ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు నార్త్ మేకర్స్‌. బ్రహ్మస్త్ర బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుండటంతో.. బ్రహ్మస్త్ర పార్ట్ 2ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

బ్రహ్మాస్త్ర రిలీజ్‌కు ముందు మూవీ టీమ్‌ కాన్ఫిడెంట్‌గానే కనిపించినా… ఇండస్ట్రీ జనాల్లో మాత్రం ఈ సినిమా సక్సెస్‌ విషయంలో చాలా అనుమానాలు నెలకొన్నాయి. కానీ అందరి డౌట్స్‌కు చెక్ పెడుతూ బిగ్‌ హిట్‌తో సర్‌ప్రైజ్‌ చేసింది బ్రహ్మాస్త్ర టీమ్‌. నెగెటివ్ కామెంట్స్ వినిపించినా.. కమర్షియల్‌గా బిగ్ నెంబర్స్‌ను రికార్డ్ చేస్తోంది ఈ ఫాంటసీ మూవీ.

తొలి భాగం సూపర్ హిట్ కావటంతో అదే జోష్‌లో సీక్వెల్ వర్క్‌ స్టార్ట్ చేశారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఆల్రెడీ కథా కథనాలు సిద్ధంగానే ఉన్నాయి కాబట్టి… త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే సీక్వెల్‌లో లీడ్ క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తారన్నది ఆసక్తిరంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఫస్ట్‌ పార్ట్‌లో శిలగా కనిపించిన దేవ్‌ క్యారెక్టర్‌ సీక్వెల్‌లో మెయిన్‌ లీడ్‌. ఈ రోల్‌లో ఓ టాప్ స్టార్ నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందన్న ఆలోచనలో ఉంది మూవీ టీమ్‌. రణవీర్‌ సింగ్‌, రణబీర్ కపూర్, హృతిక్ రోషన్ లాంటి హీరోల పేర్లు వినిపిస్తున్నా… ఇంకా ఎవరినీ ఫైనల్‌ చేయలేదు.

ఇక బడ్జెట్ విషయంలోనూ భారీగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. తొలి భాగాన్ని 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందించారు. ఇప్పుడు సీక్వెల్‌ను అంతకు మించి… దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. హాలీవుడ్ సూపర్ హీరోస్‌ మూవీస్‌కు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 ఉంటుందని కాన్పిడెంట్‌గా చెబుతోంది మూవీ టీమ్‌. 2025 డిసెంబర్ కల్లా సీక్వెల్‌ను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చే ప్లాన్స్‌ను మేకర్స్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు చదవండి