Ranveer Singh Photoshoot: రణవీర్ న్యూడ్ ఫోటోషూట్ వివాదంలో కొత్త మలుపు.. తన ఫోటోను మార్ఫింగ్ చేశారంటూ..
Ranveer Singh nude photoshoot row: తన ఫోటోను ఎవరో మార్ఫింగ్ చేశారని , తాను నగ్నంగా ఫోటో షూట్‌లో నటించలేదని పోలీసు వివరణలో వెల్లడించారు. రణవీర్ స్టేట్‌మెంట్‌పై విచారణ జరుపుతున్నారు
న్యూడ్ ఫోటో షూట్ వివాదంపై ముంబై పోలీసుల విచారణకు హాజరయ్యారు బాలీవుడ్ స్టార్ రణవీర్‌సింగ్. తన ఫోటోను ఎవరో మార్ఫింగ్ చేశారని , తాను నగ్నంగా ఫోటో షూట్‌లో నటించలేదని పోలీసు వివరణలో వెల్లడించారు. రణవీర్ స్టేట్‌మెంట్‌పై విచారణ జరుపుతున్నారు ముంబై పోలీసులు. నిజంగానే ఎవరైనా ఫోటోను మార్ఫింగ్ చేశారా ? లేక అది నిజమైన ఫోటోనే అన్న విషయం పోలీసుల విచారణలో తేలుతుంది.
రణవీర్ కొద్దిరోజుల క్రితం ఓ పేపర్ మ్యాగజేన్ కవర్‌ఫోటో కోసం ఫోటో షూట్ చేశాడు. ఆ ఫోటోలో ఆయన నగ్నంగా నటించినట్టు ఫోటో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంపై మహిళా సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రణవీర్‌కు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరైన రణవీర్ ఆ ఫోటోను మార్ఫింగ్ చేశారని ఆరోపించడంతో ఈ వ్యవహారం కొతంత మలుపు తిరిగింది.
వైరల్ ఫోటోలలో అతని ప్రైవేట్ పార్ట్‌లు కనిపించడంతో ముంబై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. రణవీర్ సింగ్‌ను పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. రణ్‌వీర్‌తో న్యూడ్ ఫోటో షూట్‌కు ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.. ఎప్పుడు, ఎక్కడ ఫోటో షూట్ చేసారు. అలాంటి షూట్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందనేదని అతనిని విచారణలో పోలీసులు ప్రశ్నించారు.
వైరల్‌గా మారిన ఫొటోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు.. ఫొటో మార్ఫ్‌నా కాదా అనే కోణంలో విచారణ జరుపనున్నారు. ఈ ఫోటో ట్యాంపరింగ్ విషయం ముందుకు వస్తే రణ్ వీర్ కు ఈ విషయంలో క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం