Sita Ramam: కొనసాగుతోన్న సీతారామమ్ మేనియా.. ఆసక్తికర ట్వీట్ చేసిన ‘సీతా మహాలక్ష్మి’..
Sita Ramam: సీతారామం.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిందీ సినిమా. హను రాఘవపూడి మార్క్ దర్శకత్వం, నటీనటుల అద్భుత ప్రతిభ ఈ సినిమా విజయ తీరాలకు చేర్చింది. చిన్న సినిమాగా విడుదలై...
Sita Ramam: సీతారామం.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిందీ సినిమా. హను రాఘవపూడి మార్క్ దర్శకత్వం, నటీనటుల అద్భుత ప్రతిభ ఈ సినిమా విజయ తీరాలకు చేర్చింది. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సునామి సృష్టించిందీ సినిమా. కథలో కంటెంట్ ఉండాలే కానీ బొమ్మ పక్కా హిట్ అవ్వాల్సిందేనని చాటి చెప్పింది సీతారామం సినిమా. యుద్ధంతో రాసిన ఈ ప్రేమ కథకు ప్రేక్షక లోకం బ్రహ్మరథం పట్టింది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ హవా కొనసాగిస్తోంది.
అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే సీతారామం ట్రెండింగ్‌లో నిలుస్తోంది. సినిమా విడుదలై నెల రోజులకుపైగా గడుస్తోన్నా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ చిత్రంలో సీతా మహాలక్ష్మి పాత్రలో ఒదిగిపోయిన మృణాల్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సీతారామం ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండడంపై స్పందించిన మృణాల్.. ఆ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. ‘ట్విట్టర్ ఓపెన్ చేసిన ప్రతీసారి సీతరామమ్ ట్రెండింగ్‌లో కనిపిస్తోంది. మీ అందరికీ ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు.
Every time I open twitter #SitaRamam is trending ! Thank you for all the love ? ? pic.twitter.com/rkop0ThC26
— Mrunal Thakur (@mrunal0801) September 14, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..