Chiranjeevi: మెగాస్టార్ మూవీలో రవితేజతో పాటు ఆ హీరో కూడా.. ఇక రచ్చ రచ్చే

మెగాస్టార్ చిరు లైనప్ చేసిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య సినిమా ఒకటి. ఈ సినిమాను మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ బాబీ. ఈ సినిమాలో మెగాస్టార్ మాస్ గెటప్ తో ఆకట్టుకోనున్నాడు

Chiranjeevi: మెగాస్టార్ మూవీలో రవితేజతో పాటు ఆ హీరో కూడా.. ఇక రచ్చ రచ్చే
Megastar 154 Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 15, 2022 | 6:20 PM

మెగాస్టార్ చిరు(Chiranjeevi) లైనప్ చేసిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య సినిమా ఒకటి. ఈ సినిమాను మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ బాబీ. ఈ సినిమాలో మెగాస్టార్ మాస్ గెటప్ తో ఆకట్టుకోనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో మెగాస్టార్ మత్యకారుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో మాస్ రాజా రవితేజ నటించనున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే రవితేజ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ మూవీలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తోంది.

అయితే ఈ సినిమాలో రవితేజతో పాటు మరో హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం విక్టరీ వెంకటేశ్‌ నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఓ పోలీసు అధికారి పాత్ర ఉందని, అది వెంకీ చేస్తున్నారని టాక్‌. త్వరలోనే ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తారని అంటున్నారు. ఇప్పటికే వెంకీ బాలీవుడ్ సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి సినిమాలో నటించనున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.  2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..