Ram Charan-Shankar: ఇది కదా రామ్ చరణ్ సినిమా రేంజే అంటే.. ఓవర్సీస్‌లో క్రేజ్ మాములుగా లేదుగా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చరణ్ నటించే సినిమా పై అందరి ఆసక్తికరంగా మారింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చరణ్ నటించే సినిమా పై అందరి ఆసక్తికరంగా మారింది. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో చరణ్ పవర్ ఫుల్ రాజకీయ నాయుకుడిగా కనిపించనున్నాడని ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఈ మూవీ నుంచి చెర్రీ ఫోటోస్ , వీడియోస్ నెట్టింట లీకైన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రైట్స్ ను ఓవర్సీస్ లో ఏకంగా 5 మిలియన్ డాలర్లకు ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఓవర్సీస్‌లో చరణ్ శంకర్ మూవీకి ఇంత క్రేజా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బీటౌన్ నటి హుమా ఖురేషి ఈ ప్రాజెక్టులో కీలకపాత్రలో నటించనుందట. ఉత్తరాది రాజకీయ నాయకురాలిగా నటిస్తోందని..ఇందులో ఆమె పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, అంజలి, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..